Salman Khan: ఇది ట్రైలర్ మాత్రమే.. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ముంబైలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకుంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ కాల్పులు జరిపింది తామేనని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ ముందుందని సోషల్ మీడియా పోస్ట్ చేశాడు.
ముంబైలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకుంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ కాల్పులు జరిపింది తామేనని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ ముందుందని సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఈ సారి ఇంటిపై కాల్పులు జరపమని.. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ లేఖలో పేర్కొన్నారు. సల్మాన్ నివాసంపై ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు.
గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్ వచ్చాయి. . దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ ఆరోపించాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ‘ఎక్స్’ గ్రేడ్ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..