Tollywood: మాజీ ప్రియుడి టాటూను శాశ్వతంగా తొలగించిన హీరోయిన్.. ఎవరో తెలుసా ? ..
లవ్, బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. సినిమాలను వదిలేసుకుంటూ సూసైడ్ వైపు ఆలోచనలు వెళ్లాయి. కానీ అదే సమయంలో తల్లి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో తిరిగి సినిమాల్లో నటించి మానసిక ఒత్తిడిని జయించింది. ఇప్పుడు భర్తతో ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ జీవితంలో చేదు రోజులను మిగిల్చిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఇప్పుడు శాశ్వతంగా తొలగించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?..
నటనపై ఆసక్తితో ఎన్నో కలలో బెంగుళూరు నుంచి ముంబైకి ఒంటరిగా ప్రయాణమయ్యింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే ఆమెకు ఓ స్టార్ హీరో సినిమాలో కథానాయికగా ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో ఆ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూకట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. కానీ అంతలోనే ప్రేమ దరి చేరింది. ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోను ఎంతో గాఢంగా ప్రేమించింది. వీరిద్దరి ప్రేమాయణం అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు జనాల్లోనూ అందరికి తెలిసిపోయింది. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారంతా. కానీ అంతలోనే వీరి ప్రేమ బ్రేకప్ వరకు వెళ్లింది. అందుకు కారణం అతడితో వచ్చిన మనస్పర్థలు. అదే సమయంలో ఆ హీరో మరొకరితో డేటింగ్ చేయడం. ఒకానొక దశలో ఆమె లవ్, బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. సినిమాలను వదిలేసుకుంటూ సూసైడ్ వైపు ఆలోచనలు వెళ్లాయి. కానీ అదే సమయంలో తల్లి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో తిరిగి సినిమాల్లో నటించి మానసిక ఒత్తిడిని జయించింది. ఇప్పుడు భర్తతో ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ జీవితంలో చేదు రోజులను మిగిల్చిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఇప్పుడు శాశ్వతంగా తొలగించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ దీపికా పదుకొణే.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కెరీర్ తొలినాళ్లలో హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత హీరో రణవీర్ సింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే వీరు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలో తాజాగా దీపికా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టంట వైరలవుతుంది. రణబీర్ తో ప్రేమలో ఉన్నప్పుడు అతడి పేరును మెడ పై భాగంలో టాటూ వేయించుకుంది. కానీ బ్రేకప్ తర్వాత ఆ టాటూ తొలగించలేకపోయంది. రణవీర్ ను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె టాటూ తొలగించడకపోవడంతో అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆ టాటూనూ శాశ్వతంగా తొలగించింది.
తాజాగా దీపికా షేర్ చేసిన ఫోటోలో ఆమె మెడ పై భాగంలో రణబీర్ పేరుతో ఉన్న టాటూ కనిపించడం లేదు. దీంతో ఎట్టకేలకు దీపికా రణబీర్ జ్ఞాపకాలను చెరిపేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. గతేడాది పఠాన్, జవాన్, ఫైటర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది దీపికా. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.