TOP9 ET: రిలీజ్‌కు ముందే రూ.100 కోట్లు అది పుష్ప రాజ్ క్రేజ్ | ఆ విషయంలో NTRని ఫాలో అవుతున్న బన్నీ
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్న అల్లు అర్జున్.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ పుష్ప2 విషయంలో మాత్రం కాస్త ముందుగానే కలెక్షన్స్ కౌంట్ ఒపెన్ చేశారు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్ ఆగస్ట్ 15న రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప ది రూల్ మూవీ అప్పుడే 100కోట్లు వచ్చేలా చేసుకుందట. ఓ ఫేమస్ ఓటీటీ జెయింట్ ఈ మూవీని 100 కోట్ల భారీ అమౌంట్ కోట్ చేసి మరీ.. దక్కించుకుందట.
01.allu arjun: రిలీజ్‌కు ముందే 100 కోట్లు .. అది పుష్ప రాజ్ క్రేజ్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్న అల్లు అర్జున్.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ పుష్ప2 విషయంలో మాత్రం కాస్త ముందుగానే కలెక్షన్స్ కౌంట్ ఒపెన్ చేశారు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్ ఆగస్ట్ 15న రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప ది రూల్ మూవీ అప్పుడే 100కోట్లు వచ్చేలా చేసుకుందట. ఓ ఫేమస్ ఓటీటీ జెయింట్ ఈ మూవీని 100 కోట్ల భారీ అమౌంట్ కోట్ చేసి మరీ.. దక్కించుకుందట.
02. Ram charan: జరగండి.. జరగండి..! వచ్చేది అక్కడ గ్లోబల్ స్టార్
అటు ఆన్ స్క్రీన్ .. ఇటు ఆఫ్ స్క్రీన్.. అటు స్టైలిష్ లుక్.. ఇటు సింపుల్ లుక్! ఇలా అటీటు ఏటు చూసినా.. మైండ్ బ్లోయింగ్‌గా కకనిపించే .. కనిపించే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సారి అదే పని చేశారు. వేల్స్ యూనివర్సిటీ తనకొచ్చిన డాక్టరేట్ పట్టా తీసుకునేందుకు రీసెంట్‌గా చెన్నైలో ల్యాండ్ అయిన ఈ హీరో.. ఇప్పుడు తన సింపుల్ లుక్స్‌తో కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తున్నారు.
03. Manchu Manoj : తండ్రైన మంచు మనోజ్
మంచు మనోజ్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. మనోజ్, మౌనికకు ఆడబిడ్డ పుట్టినట్టుగా వెల్లడించారు మంచు లక్ష్మీ. పాపను ఎంఎం పులి అనే ముద్దుపేరుతో పిలుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. పాప ఫోటోను రివీల్ చేయకపోయినా.. కార్టూన్ ఫోటోలతో మనోజ్ ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మంచు లక్ష్మీ.
04. chiranjeevi: హనుమాన్ పై సినిమా చేయాలనుకున్నా – చిరు
హనుమాన్ పై ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు మెగా స్టార్ చిరు చెప్పారు. అయితే ఆ అవకాశం తనకు రాలేదన్నారు. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. తేజా సజ్జా చేసిన హనుమాన్ మూవీ చూశాక తనుకు సంతృప్తి కలిగిందన్నారు. తేజ సజ్జా తన ప్రయాణంలో ఒక భాగమని.. తను హనుమాన్ సినిమా చేస్తే.. తాను కూడా చేసినట్టే అన్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తేజా సజ్జాను ఓ రేంజ్‌లో ప్రశంసించారు చిరు.
05. NTR, allu : ఆ విషయంలో NTRని ఫాలో అవుతున్న బన్నీ
బావా.. బావా అని పిలచుకుంటూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కెరీర్లో మాత్రం ఎవరి దారిలో వారు నడుస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఎన్టీఆర్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకే సారి రెండు సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ఫ 2 సినిమా ఫినిష్ అవగానే.. ఎన్టీఆర్‌లా ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఒకే సారి అట్లీ సినిమాను.. త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేయనున్నారట.
06.pooja: 45 కోట్ల ఖరీదైన విల్లా కొన్న స్టార్ హీరోయిన్
పూజా హెగ్డే! ఇప్పుడు మాత్రం సినిమాలు కాస్త తగ్గాయన్న మాటే కానీ.. ఒకప్పుడు మాత్రం హిట్స్ ఫట్స్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో చాన్సులు కొట్టేసేది. రెండు చేతులతో సంపాదించేది. ఇక ఆ డబ్బులతోనే కావచ్చు.. రీసెంట్‌గా ఈ బ్యూటీ ముంబాయ్ బాంద్రాలో ఓ మాన్షన్ కొనుగోలు చేసిందట. సీ ఫేసింగ్… 4 వేల sftతో వెరీ లావిష్‌గా ఉన్న ఈ మాన్షన్ ఖరీదు 45 కోట్లట. అంతేకాదు తన ఫ్యామిలీతో రేపో మాపో .. ఈ ఇంటికి షిష్ట్ కూడా అయ్యేందుకు ప్లాన్ చేస్తుందట మన పూజీ బేబీ.
07.rajamouli: తన యాక్టింగ్‌తో జక్కన్నకే .. ఝలక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ .
డేవిడ్ వార్నర్ అంటే.. స్టార్ క్రికెటర్ అనే తెలుసు..! ఫన్నీ రీల్స్ తో వైరల్ అయ్యే ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనే తెలుసు. కానీ తన యాక్టింగ్‌తో జక్కన్నకే ఝలక్ ఇచ్చిన క్రికెటర్ అని మీకు తెలియదు కదా..! కానీ ఇది నిజం! తన డైరెక్షన్లో ఎప్పుడూ స్టార్ క్రికెటర్లకు చెమటలు పట్టించే జక్కన్న.. డేవిడ్ వార్నర్ యాక్టింగ్ చూసి షాకయ్యారు. ఇక చాలు నీ యాక్టింగ్‌ను తట్టుకోవడం నా వల్ల కాదంటూ చేతులెత్తి మొక్కాడు. అయితే ఇది ఓ యాడ్‌లో..!ఇక రీసెంట్‌గా ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంద కూడా..!
08. namitha: దళపతి విజయ్‌పై పోటీకి స్టార్ హీరోయిన్ ?
2026 అసెంబ్లీ ఎన్నికల్లో.. కోలీవుడ్ దళపతి విజయ్ పై పోటీకి సై అంటున్నారు ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత బీజేపీ నేత నమిత. రీసెంట్‌గా సినిమాలు మానేసి.. పెళ్లి జీవితం ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తన ప్రత్యర్థిగా దళపతి విజయ్ పై పోటీ చేయాలనుకుంటున్నట్టు రివీల్ చేశారు. అంతేకాదు విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకున్నారు.
09.vidyabalam: ఆ అబ్బాయి ప్రేమ వల్ల పిచ్చెక్కింది..
ప్రేమ కొందరికి తీపి జ్ఙాపకంగా ఉంటే.. మరికొందరికి మాత్రం చేదు జ్ఙాపకంగా ఉంటుంది. తన విషయంలో ఆ రెండోదే జరిగిందని అంటున్నారు విద్యాబాలన్. కాలేజీ డేస్‌లో తనో అబ్బాయిని డీప్‌గా ప్రేమించానని.. కానీ ఆ తర్వాత తను పోకిరీ అని తెలియడంతో.. బ్రేకప్ చెప్పానని అన్నారు విద్యాబాలన్. కానీ ఆ అబ్బాయితో బ్రేకప్ తర్వాత తాను చాలా సఫర్ అయ్యానని.. కొన్ని సార్లు పిచ్చెక్కినట్టు అయ్యేదని చెప్పారు. ఎందుకు ఇలాంటి వాణ్ణి ఇంత డీప్‌గా లవ్ చేశానని…ఎన్నో సార్లు తనలో తాను అనుకునేదాన్నని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తరువాత మాత్రం ఎవ్వరినీ డీప్‌గా లవ్ చేయలేదని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.