Indian Student Shot Dead in Canada: కెనడాలో భారత విద్యార్ధిపై కాల్పులు.. కారులో ప్రయాణిస్తుండగా ఘటన! మృతి

భారత్‌కి చెందిన ఓ విద్యార్ధిపై కెనడాలో కాల్పులు జరిగాయి. కారు డ్రైవ్‌ చేస్తుకుంటూ వెళ్తున్న విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో కారులో విద్యార్ధి మృతి చెందాడు. ఈ ఘటన కెనడాలోని సౌత్ వాంకోవర్‌లో ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. వాంకోవర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత్‌కు చెందిన చిరాగ్‌ ఆంటిల్‌ (24) తన ఆడీ కారులో బయటకు వెళ్లాడు..

Indian Student Shot Dead in Canada: కెనడాలో భారత విద్యార్ధిపై కాల్పులు.. కారులో ప్రయాణిస్తుండగా ఘటన! మృతి
Indian Student Shot Dead In Canada
Follow us

|

Updated on: Apr 14, 2024 | 6:00 PM

ఒట్టావా, ఏప్రిల్‌ 14: భారత్‌కి చెందిన ఓ విద్యార్ధిపై కెనడాలో కాల్పులు జరిగాయి. కారు డ్రైవ్‌ చేస్తుకుంటూ వెళ్తున్న విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో కారులో విద్యార్ధి మృతి చెందాడు. ఈ ఘటన కెనడాలోని సౌత్ వాంకోవర్‌లో ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. వాంకోవర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత్‌కు చెందిన చిరాగ్‌ ఆంటిల్‌ (24) తన ఆడీ కారులో బయటకు వెళ్లాడు. గత శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈస్ట్ 55వ అవెన్యూ మెయిన్ స్ట్రీట్‌ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకోగా కారులో చిరాగ్‌ మృతి చెందికనిపించినట్లు గుర్తించాం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంత వరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు. చిరాగ్ తల్లిదండ్రులు హర్యానాలోని సోనిపట్‌లో ఉంటున్నారు. చిరాగ్‌ హత్య గురించి తెలియడంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాగా 2022లో ఎంబీఏ చదివేందుకు చిరాగ్‌ స్టడీ వీసాపై కెనడా వెళ్లినట్లు మృతుడి సోదరుడు రోమిత్ యాంటిల్ తెలిపారు. యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేసిన అతడు ఇటీవల అక్కడ వర్క్‌ పర్మిట్‌ పొందాడని, అక్కడే జాబ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు గురైన రోజున ఉదయం కూడా చిరాగ్‌తో ఫోన్‌లో మాట్లాడానని, అదే తన అన్నతో చివరిసారిగా మాట్లాడానని తెలిపాడు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్లడానికి తన ఆడి కారులో బయల్దేరాడని తెలిపాడు. అప్పుడే అతను హత్యకు గురైనట్లు పేర్కొన్నాడు. తన అన్న చిరాగ్‌తో ఎవరికీ గొడవలు లేవని, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడని , చాలా మర్యాద కలిగిన వ్యక్తి అని, అంతమంచి వ్యక్తిని హత్య చేయవల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటూ మృతుడి తమ్ముడు రోమిత్ యాంటిల్ మీడియాకు తెలిపాడు.

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ‘కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్ యాంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యపై తక్షణ దృష్టి సారించండి. దర్యాప్తు పురోగతిని నిశితంగా పరిశీలించి, సత్వర న్యాయం జరిగేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నామని చౌదరి పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు చిరాగ్ యాంటిల్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్‌మీ ద్వారా అతని కుటుంబం ఫండ్స్‌ సేకరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్
ఆ బిజినెస్‌మెన్‌తో మళ్లీ ప్రేమలో పడిన సారా టెండూల్కర్.. ఫొటోస్
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..