Gold Smuggling: ఎన్నికల సిత్రాలు.. వందల కోట్ల విలువైన 1400 కిలోల బంగారం సీజ్! ఎయిర్‌పోర్ట్ అధికారులపై డౌట్..
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేయగా.. లారీలో 1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. దీనిపై ఆరా తీయగా.. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి..
శ్రీపెరుంబుదూర్, ఏప్రిల్ 15: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేయగా.. లారీలో 1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. దీనిపై ఆరా తీయగా.. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. మొత్తం బంగారంలో 400 కిలోలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయని మిగిలిన బంగారానికి తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. కాంచీపురం జిల్లా కుంరదూర్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన సోదాల్లో పట్టుబడిన 1425 కిలోల బంగారు కడ్లీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. 400 కిలోలకు సంబంధించిన పత్రాలు మాత్రమే ఉండడంతో శ్రీపెరంబుదూర్ కోటట్షియార్‌కు దానిని అప్పగించారు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.
కాగా తమిళనాడులో 19వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు, బహుమతులు పంపిణీ చేయకుండా భద్రతా బలగాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కుంరత్తూర్ ఫ్లైఓవర్ సమీపంలో వండలూరు-మీంజూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఫ్లయింగ్ టీం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వచ్చిన 2 ట్రక్కులను సాంకేతిక పరికరాలతో ట్రక్కుల్లోకి తీసుకెళ్లి మరీ తనిఖీలు చేయసాగారు. అనుమానం వచ్చి లారీలను అనువనువునా చెక్ చేశారు. ఇంతలో పెద్ద లారీలో 1000 కిలోల బంగారు కడ్డీలు, చిన్న ట్రక్కులో 400 కిలోల బంగారు కడ్డీలు కలిపి మొత్తం 1400 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారు కడ్డీలను హాంకాంగ్ నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి తీసుకువచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి శ్రీపెరంబుదూర్ సమీపంలోని మన్నూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి వేర్వేరు వ్యక్తులకు ఈ బంగారాన్ని పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.1000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. కేవలం 400 కేజీల బంగారానికి రసీదు చూపి, భద్రతా సిబ్బంది కళ్లుగప్పి చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ బంగారాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారో తెలియరాలేదు.
రంగంలోకి దిగిన ఆదాయపన్ను శాఖ ఈ బంగారం గురించి, వారి వద్ద ఉన్న రశీదు గురించి ఆరా తీస్తున్నారు. ఇన్ని కోట్ల విలువైన బంగారం యజమాని ఎవరు? ఎందుక తరలిస్తున్నారు? ఇంకా వారి వద్ద ఎంత బంగారం ఉంది? వంటి పలు వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. సంబంధిత పత్రాలు సమర్పిస్తేనే బంగారాన్ని అసలు యజమానికి అప్పగిస్తామన్నారు. లేకుంటే మొత్తం బంగారాన్ని జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు అప్పగిస్తామన్నారు. రసీదు లేకుంటే విమానాశ్రయం నుంచి ఇంత బంగారం ఎలా బయటకు వచ్చింది? అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా? ఈ బంగారం బయటకు రావడానికి సహకరించిందెవరు? ఈ బంగారాన్ని నగదుగా మార్చుకుని ఎన్నికలకు వినియోగించేందుకు ప్లాన్ చేస్తున్నారా? వంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీనిపై చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులతోపాటు పలువురిని విచారించే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడంతో చెన్నై చుట్టుపక్కల కాంచీపురం జిల్లాల్లో సోదాలు ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి