Google: గూగుల్ తల్లిని నమ్ముకున్న రైల్వే.. ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిన రైలు.. ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి..

గతంలో కూడా గూగుల్‌ని నమ్ముకుని ప్రయాణం చేసిన వారు నిలువునా మునిగిపోయిన వార్తలు మనం అనేకం చూశాం. చాలా సార్లు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బయల్దేరిన వాహనదారులు ఏకంగా నదులు, అడవులు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లిన సంఘటనలు సోషల్ మీడియాలో అనేకం చూశాం. అయితే, ఇప్పుడు గూగుల్ ట్రాప్‌లో పడ్డ ఇండియన్‌ రైల్వే కూడా ప్రజల విమర్శలకు కారణంగా మారింది.

Google: గూగుల్ తల్లిని నమ్ముకున్న రైల్వే.. ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిన రైలు.. ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి..
Murder Express
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2024 | 7:52 AM

గూగుల్‌… ఇప్పుడు ఇదే చాలా మందికి దిశ నిర్దేశంగా మారింది. ఏ పని చేయాలన్న ప్రజలు గూగుల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గూగుల్‌ని నమ్ముకుని ప్రయాణం చేసిన వారు నిలువునా మునిగిపోయిన వార్తలు మనం అనేకం చూశాం. చాలా సార్లు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బయల్దేరిన వాహనదారులు ఏకంగా నదులు, అడవులు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లిన సంఘటనలు సోషల్ మీడియాలో అనేకం చూశాం. అయితే, ఇప్పుడు గూగుల్ ట్రాప్‌లో పడ్డ ఇండియన్‌ రైల్వే కూడా ప్రజల విమర్శలకు కారణంగా మారింది. గూగుల్ సహాయంతో చేసిన అనువాదం కొన్నిసార్లు అర్థాన్ని వక్రీకరించేలా చేస్తుంది. అలాంటి ఒక అనువాదం రైల్వే చేసింది.

గూగుల్‌ ట్రాన్స్‌ లేషన్‌ను నమ్ముకున్న భారతీయ రైల్వే ఇటీవల ఒక రైలుకు పేరు పెట్టింది. అది శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దూసుకెళ్లింది. దాంతో ఇండియన్‌ రైల్వేపై నెటిజన్లు ఫన్నీగా ప్రశంసించటం మొదలుపెట్టారు. దీనిపై ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. తన తప్పును అంగీకరించింది. జరిగిన తప్పిదానికి చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఇంతకీ రైల్వే చేసిన ఆ తప్పేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గూగుల్‌ ట్రాన్స్‌లేషన్ ఆధారంగా భారతీయ రైల్వే ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేసింది.. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని హటియా, కేరళలోని ఎర్నాకుళం నగరాల మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తున్నది. అయితే హిందీ పదమైన ‘హటియా’ను మలయాళంలో అనువాదించడంలో తప్పు జరిగింది. హతియా(హంతకుడి)గా భావించి ఆ అర్థం వచ్చేలా ‘కోలపథకం’ అని మలయాళంలో రాశారు. దీంతో హటియా-ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు కాస్తా ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిపోయింది. ఇంకేం కొందరు స్థానికులు దీన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేశారు.. ఇలా రైల్వే శాఖ చేసిన తప్పిందంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రైలుకు సంబంధించిన నేమ్‌ బోర్డు ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు తమ పొరపాటును గ్రహించారు. ఆ రైలు బోర్డుపై ఉన్న పేరును సరిదిద్దారు.

ఇవి కూడా చదవండి

రైల్వే అధికారులు చేసిన తప్పుతో నెటిజన్లు, అటు కేరళవాసులు మండిపడ్డారు. గూగుల్‌ ట్రాన్స్‌లేషన్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇలాంటి గొందరగోళం తప్పదని పలువురు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే