Squirrel Vs Snake: పాముతో ఫైట్ చేసిన ఉడుత.. వైరల్ అవుతున్న వీడియో, ఉడుత ధైర్యానికి నెటిజన్స్ హ్యాట్సాఫ్

సుఖాల్లోనే కాదు దుఃఖంలో కూడా మీకు రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఆపద సమయంలో ఫ్రెండ్ తన ష్రెండ్ కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. స్నేహం కోసం ఒకరి జీవితాన్ని త్యాగం చేసే కథలు చాలానే వింటాం. ఈ విషయాలు మానవులకే కాకుండా ఇతర జీవులకు కూడా వర్తిస్తాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Squirrel Vs Snake: పాముతో ఫైట్ చేసిన ఉడుత.. వైరల్ అవుతున్న వీడియో, ఉడుత ధైర్యానికి నెటిజన్స్ హ్యాట్సాఫ్
Viral Video
Follow us
Balu Jajala

|

Updated on: Apr 15, 2024 | 7:38 AM

సుఖాల్లోనే కాదు దుఃఖంలో కూడా మీకు రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఆపద సమయంలో నిజమైన ఫ్రెండ్ ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. స్నేహం కోసం ఒకరి జీవితాన్ని త్యాగం చేసే కథలు చాలానే వింటాం. ఈ విషయాలు మానవులకే కాకుండా ఇతర జీవులకు కూడా వర్తిస్తాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే వారెవ్వా అని అంటారు.

పాములు ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. బుసలు కొడుతూ కాటేస్తూ ఎవరినైనా సులువుగా చంపేస్తుంది. అలర్ట్ కాకపోతే పాము బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ ఓ స్నేహితుడు అండగా ఉంటే మరణాన్ని కూడా సులభంగా ఓడించవచ్చు. అలాంటిదే ఈ వీడియోలో కనిపించింది. ఓ పాము ఉడుతను చంపేస్తుండగా మరో ఉడుత వచ్చి కాపాడుతుంది. వీడియోలో ఏముందంటే.. ఒక పాము ఉడుతను చంపేందుకు వస్తుంది. ఉడుతను గట్టి చుట్టేసుకొని చంపే ప్రయత్నం చేస్తు ఉంటుంది. ఎంత ప్రయ్నతించినప్పటికీ పాము బారి నుంచి బయటపడలేక గిలగిల కొట్టుకుంటుంది. ఇక పాము ఉడుతను చంపే ప్రయత్నం చేస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో మరో ఉడుత వచ్చి ఈ దృశ్యాన్ని చూస్తుంది.

వెంటనే తన స్నేహితుడిని రక్షించడానికి ముందుకు వస్తుంది ఉడుత. తన ఫ్రెండ్ ప్రాణాలను కాపాడేందుకు పాముతో హోరాహోరీగా ఫైట్ చేస్తుంది. దీంతో పాము ఏం చేయలేక ఉడుతను విడిచిపెట్టేస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలో రెండు ఉడుతలు అక్కడ్నుంచి పరార్ అయి చెట్టు ఎక్కేస్తాయి.  ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా నిమిషాల్లో వైరల్ గా మారింది. ఇక వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘స్నేహితులు మీతో ఉంటే భయపడాల్సిన పని లేదు.’ ‘దీన్నే నిజమైన స్నేహం అంటారు’ అని మరొకరు అని నెటిజన్స్ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..