Cow Viral Video: ఆకలేస్తోంది.. నాకేమైనా పెట్టు.. మారాం చేస్తున్న ఆవు.. అతనేం చేశాడంటే.!

Cow Viral Video: ఆకలేస్తోంది.. నాకేమైనా పెట్టు.. మారాం చేస్తున్న ఆవు.. అతనేం చేశాడంటే.!

Anil kumar poka

|

Updated on: Apr 14, 2024 | 6:12 PM

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా, స్నేహంగా, విశ్వాసంగా మసలుతుంటాయి. కానీ వీధుల్లో తిరిగే జంతువులు కూడా తమపై దయతో ఆహారం పెట్టేవారిపై అంతే ప్రేమ, స్నేహాన్ని కలిగి ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఒక ఆవు కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారి వద్దకు వెళ్లి తనకు ఆహారం పెట్టమని అడుగుతున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా, స్నేహంగా, విశ్వాసంగా మసలుతుంటాయి. కానీ వీధుల్లో తిరిగే జంతువులు కూడా తమపై దయతో ఆహారం పెట్టేవారిపై అంతే ప్రేమ, స్నేహాన్ని కలిగి ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఒక ఆవు కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారి వద్దకు వెళ్లి తనకు ఆహారం పెట్టమని అడుగుతున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోలో ఓ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు బిజీగా కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇంతలో ఓ ఆవు అక్కడికి వచ్చింది. నేరుగా ఓ వ్యాపారి దగ్గరకు వెళ్లి నిల్చుంది. అతను కస్టమర్‌కి గుమ్మడికాయ కట్‌ చేసి ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆవును పట్టించుకోలేదు. అయితే ఆవు నాకు ఆకలేస్తోంది… ఏమైనా పెట్టు అన్నట్టుగా గోముగా అతని మెడచుట్టూ తన తలను చుట్టేసింది. ఆ వ్యాపారి ఏమాత్రం విసుక్కోకుండా కొంచెం ఆగు కస్టమర్‌ని పంపించి నీకు పెడతాను అన్నట్టుగా ఆవును బుజ్జగించి కస్టమర్‌కి కూరగాయలు ఇచ్చిన తర్వాత ఆవుకు కూరగాయలు స్వయంగా తన చేత్తో తినిపించాడు. హృదయాన్ని హత్తుకుంటున్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. చుట్టూ అన్ని కూరగాయలు కనిపిస్తున్నా కలబడకుండా వ్యాపారిని అడిగి మరీ తింటున్న ఆవు సంస్కారానికి అందరూ ఫిదా అవుతున్నారు. తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..