AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seema Chintakayalu: సమ్మర్‌ స్పెషల్‌ సీమచింతకాయలు.. తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.!

Seema Chintakayalu: సమ్మర్‌ స్పెషల్‌ సీమచింతకాయలు.. తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.!

Anil kumar poka
|

Updated on: Apr 14, 2024 | 6:20 PM

Share

వేసవి మొదలైంది.. ఎండలతో పాటుగానే మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు కూడా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా కనిపించే మామిడిపండ్లు, ముంజలతో పాటుగా సీమచింత కాయలు కూడా బాగా ఫేమస్‌. సీమచింతకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రుచిలో కాస్త వగరు, కొన్ని తియ్యగా ఉంటాయి. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం పిథీసెలోబియం డల్సె.

వేసవి మొదలైంది.. ఎండలతో పాటుగానే మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు కూడా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా కనిపించే మామిడిపండ్లు, ముంజలతో పాటుగా సీమచింత కాయలు కూడా బాగా ఫేమస్‌. సీమచింతకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రుచిలో కాస్త వగరు, కొన్ని తియ్యగా ఉంటాయి. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం పిథీసెలోబియం డల్సె. ఈ సీమ చింతను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇక ఈ చీమ చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్‌-సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్, ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి.

సీమ చింతలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌- సి, ఎ, పొటాషియం, ఐరన్‌ లాంటి అనేకానేక విటమిన్లు, మినరల్స్‌ ఇందులో ఉన్నాయి. ఇందులోని డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో ఉంది. చీమ చింతకాయలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు అంటున్నారు నిపుణులు. సీమ చింతకాయలలో గ్లైసిమిక్ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయులను త్వరగా పెంచదు. అలా డయాబెటిస్‌ ఉన్నవారికీ సీమచింత మంచి ఆహారమే. సీమచింతలో క్యాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి సీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి. అయితే మోతాదుకి మించి వీటిని తినకూడదు. అలా తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు. ఇందులోని విటమిన్‌-ఎ కంటిచూపు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువ. గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా వుండటమే మంచిదంటున్నారు నిపుణులు. వగరుగా వుండే చీమచింతకాయలు తింటే గొంతు పట్టుకుంటుంది కనుక వాటిని తినకపోవడమే మంచిదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..