Anand Mahindra: నేలపై వాలిపోయిన స్కై టవర్.. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన పోస్ట్ వైరల్..! ఇది ఎక్కడుందంటే…?
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన ప్రతి పోస్ట్ వెనుక ఎంతో విలువైన సందేశం ఉంటుంది. అందుకే ఎక్స్‌లో 1.10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆనంద్ మహీంద్రా. తాజాగా చేసిన మరో పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రారంభించిన
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన ప్రతి పోస్ట్ వెనుక ఎంతో విలువైన సందేశం ఉంటుంది. అందుకే ఎక్స్‌లో 1.10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆనంద్ మహీంద్రా. తాజాగా చేసిన మరో పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రారంభించిన తలసేరి-మహీ బైపాస్ ఫోటోను సోషల్ మీడియా ఖాతా X ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేశారు..X లో అతను బైపాస్‌ను ప్రశంసిస్తూ ఫోటోకు ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. నేలపై వాలిన ఆకాశహర్మ్యం అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫ్లైఓవర్ కాంక్రీట్‌తో చేసినప్పటికీ ఇక్కడి సహజ సౌందర్యం దానికి మరెక్కడా లేని అందాన్ని కలిగించింది. దానిని అభినందించకుండా ఉండలేమని ఆయన పేర్కొన్నారు.
తలస్సేరి-మహి బైపాస్. పోస్ట్ ప్రకారం.. అక్కడి బైపాస్ నేలపై పడి ఉన్న ఆకాశహర్మ్యం లాగా అనిపించింది.. సహజ ప్రకృతి దృశ్యంపై కాంక్రీటు వాలిపోయింది. కానీ దానికి ముందునుంచే ఉన్న సొంత సౌందర్యం అలాగే ఉంది. దాని గుండా ప్రయాణించి రెండు వైపులా అందాన్ని ఆరాధించాలనే తాపత్రయాన్ని ఎవరు కోరుకోకుండా ఉంటారు…అంటూ ఆనంద్ మహీంద్రా X లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ సందడి చేస్తోంది.
The Thalassery-Mahe bypass.
Like a skyscraper lying down flat on its side…
At first it looked like a concrete imposition on the natural landscape.
But it has its own aesthetic.
And I can’t deny the temptation to cruise down it and appreciate the beauty on either side.… pic.twitter.com/8u63JPQIG2
— anand mahindra (@anandmahindra) April 11, 2024
సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ ఫోటోకు 221,000 వీక్షణలు, దాదాపు 5,000లకు పైగా కామెంట్లు వచ్చాయి. తలస్సేరి-మహి జాతీయ రహదారి బైపాస్ ముజప్పిలంగాడ్ నుండి అజియూర్ వరకు విస్తరించి ఉంది. ఇందులో నాలుగు ప్రధాన వంతెనలు ఉన్నాయి. ఒక రైల్వే ఓవర్‌పాస్, అనేక అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌లను కలిగి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11న ఇక్కడి బైపాస్‌ను ప్రారంభించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..