Viral: మట్టి తవ్వకాల్లో బయటపడ్డ పే..ద్ద బండరాయి.. వెలికితీయగా కళ్లు జిగేల్.!

ఇంటి నిర్మాణ పనుల్లో, లేదా పురాతన తవ్వకాలు జరుపుతున్నప్పుడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతుండటం సర్వసాధారణం. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇటీవల ఇదే కోవలో ఓ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నిర్మాణ పనుల్లో..

Viral: మట్టి తవ్వకాల్లో బయటపడ్డ పే..ద్ద బండరాయి.. వెలికితీయగా కళ్లు జిగేల్.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 15, 2024 | 8:37 AM

ఇంటి నిర్మాణ పనుల్లో, లేదా పురాతన తవ్వకాలు జరుపుతున్నప్పుడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతుండటం సర్వసాధారణం. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇటీవల ఇదే కోవలో ఓ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా ఓ వ్యక్తి తన ఇంటి దగ్గర గొయ్యి తవ్వుతుండగా.. అరుదైన అద్భుతం కనిపించింది. ఇంతకీ అదేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. బష్కోలా గ్రామానికి సమీపంలో నివాసముంటున్న షేర్ సింగ్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పొలంలో తవ్వకాలు జరిపాడు. ఓ 20 అడుగుల లోతైన గొయ్యి తవ్వగా.. వారికి ఒక పే.. ద్ద.. బండరాయి తగిలింది. నీటి మరను పెట్టేందుకు మరో 5 అడుగులు అవసరం కాగా.. కూలీలకు మరో 5 అడుగుల గొయ్యి తవ్వమని చెప్పాడు సింగ్. అలా తవ్వగా.. ఆరు తలలు, చేతిలో ఈటెతో ఉన్న ఓ పురాతన విగ్రహం బయటపడింది. మనాలి పక్కనే ఉన్న సిమ్సా, ఖాఖ్‌నాల్ గ్రామాలలోని దేవాలయాల్లో కార్తీక స్వామి విగ్రహాలు ఎక్కువగా ఉండటంతో.. ఈ తవ్వకాల్లో దొరికిన విగ్రహం కూడా కార్తీక స్వామిదేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కులులో వందలాది దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ తవ్వకాలు జరిపిన ప్రతీసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతుంటాయట. ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు మహాభారత కాలంలో నిర్మించినవిగా స్థానికులు నమ్ముతారు. గతేడాది ఏప్రిల్‌లో కూడా ఇలానే ఓ పురాతన విగ్రహం బయటపడింది. లగ్ లోయలోని భల్తీ నారాయణ్ ఆలయంలో ప్రహరీ గోడ నిర్మాణం కోసం తవ్వుతుండగా 16వ శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహం లభ్యమైంది.

Viral Photo