Watch Video: ఈ పాపకు పిచ్చి పీక్స్ కు చేరుకుంది.. చెట్టెక్కి ఏం చేస్తుందో చూడండి..

విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు రూపొందిస్తున్నారు. మరికొందరు ప్రాణాలను సైతం రిస్క్‌ లో పెడుతూ ఎవరూ ఊహించని పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది.

Watch Video: ఈ పాపకు పిచ్చి పీక్స్ కు చేరుకుంది.. చెట్టెక్కి ఏం చేస్తుందో చూడండి..
Woman Climbs Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2024 | 10:40 AM

ఇంటర్‌నెట్‌ వినియోగం విచ్చలవిడిగా మారింది. ప్రజలు 24 గంటలూ సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రీల్ యుగంలో కొంత మంది లైక్‌లు, ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు రూపొందిస్తున్నారు. మరికొందరు ప్రాణాలను సైతం రిస్క్‌ లో పెడుతూ ఎవరూ ఊహించని పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. వైరల్‌ వీడియోలో ఒక మహిళ ఎత్తైన చెట్టు కొమ్మలపై ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది.

miss_pooja అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక యువతి సాంప్రదాయ దుస్తులు ధరించి చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ వరకు ఎక్కి నిల్చుంది. మరేక్కడా ప్లేస్‌ లేనట్టుగా యువతి చెట్టు చిటారుకొమ్మల్లో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. లెహంగా, చున్నీ వేసుకుని “చైన్ మేరా ట్యూనే లే లియా“ పాటకు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో డ్యాన్స్ చేస్తూ హల్‌చల్‌ చేసింది. ఆమె డ్యాన్స్‌ను కింద ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్త విపరీతంగా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 2.5 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. యువతి ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా చెట్టు ఎక్కి డ్యాన్స్ చేస్తోందని, చిన్న పొరపాటు జరిగినా యువతి చెట్టుపై నుంచి నేరుగా నేలపై పడిపోతుందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరికొందరు ఫన్నీగా స్పందిస్తూ..భారతీయ డ్యాన్స్‌ కల ఇంత ఎత్తుకు చేరుకోవడం గర్వకారణం అంటుంటే..మరొకరు..ఈ గ్రామంలో జియో టవర్‌లను ఏర్పాటు చేయలేదనుకుంటా..రీల్స్ కోసం యువత ఇలా ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి