AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar Control Tips: సోంఫును ఇలా తింటే.. మధుమేహుల్లో షుగర్‌ మటుమాయం..!

ఇందులో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ క్రింది పద్ధతుల్లో సోంపును వాడితే ప్రయోజనం ఉంటుంది.

Blood Sugar Control Tips: సోంఫును ఇలా తింటే.. మధుమేహుల్లో షుగర్‌ మటుమాయం..!
Blood Sugar Control Tips
Jyothi Gadda
|

Updated on: Apr 15, 2024 | 9:14 AM

Share

ప్రస్తుత కాలంలో ప్రజల లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. చెడు ఆహారం, మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ఈ వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిక్‌ బాధితుల్లో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాలం ఉంటే, అది శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను దాన్ని మూలలతో నిర్మూలించలేము. కానీ, మీరు మందులు, ఆహారం, జీవనశైలి మార్పులతో శాశ్వతంగా నియంత్రించవచ్చు. అంతేకాదు కొన్ని హోం రెమెడీస్ సహాయంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అందులో భాగంగా సోంపు వాడకం డయాబెటిస్‌కు సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోపులో ఉండే కొన్ని లక్షణాలు డయాబెటిక్ రోగులకు మేలు చేస్తాయి. అయితే, సోంపును ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

డయాబెటిస్‌లో సోంపు వల్ల కలిగే ప్రయోజనాలు..

డయాబెటిక్ రోగులకు సోంపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ క్రింది పద్ధతుల్లో సోంపును వాడితే ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సోంపు వాటర్..

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో సోంపును చేర్చుకోవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, మీరు సోంపువాటర్‌ని తాగవచ్చు. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ సోంపును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. అప్పుడు ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. నీటిలో నానిన సోంపును కూడా నమలి మింగేయండి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

సోంపు టీ..

మీరు కూడా మధుమేహంతో బాధపడుతున్నట్లయితే, సోంపు టీ తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది. దీని కోసం ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. అందులో ఒక చెంచా సోంపు వేసి మరిగించాలి. సగం నీరు మిగిలి ఉన్నప్పుడు, దానిని ఫిల్టర్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చగా తాగాలి.

సోంపును నమిలి తినేయండి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు సోంపును నమిలి ప్రతిరోజూ భోజనం తర్వాత తినవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..