- Telugu News Photo Gallery University of Michigan survey reveales the benefits of drinking alcohol together
Drinking Partnership: వారెవ్వా.. భార్య, భర్త, ఓ మద్యం సీసా.. కలిసి సేవిస్తే కలిగే సుఖం.. ఈ సర్వేలో వెల్లడి
సాధారణంగా డ్రింకింగ్ అనేది అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. మానవ శరీరంపై ఆల్కహాల్ అనేక ప్రతికూల ప్రభావాలు చూపుతాయంటారు. అయితే, కలిసి మద్యం సేవించే దంపతులు మంచి జీవితాన్ని గడుపుతున్నారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. మద్యపాన భాగస్వామ్య సిద్ధాంతం వైవాహిక జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.
Updated on: Apr 15, 2024 | 9:51 AM

సాధారణంగా డ్రింకింగ్ అనేది అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. మానవ శరీరంపై ఆల్కహాల్ అనేక ప్రతికూల ప్రభావాలు చూపుతాయంటారు. అయితే, కలిసి మద్యం సేవించే దంపతులు మంచి జీవితాన్ని గడుపుతున్నారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

మద్యపాన భాగస్వామ్య సిద్ధాంతం వైవాహిక జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. మద్యం సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ పరిశోధనలో భాగంగా గత రెండు దశాబ్దాలుగా దాదాపు 4,500 జంటలను అధ్యయనం చేసింది.

దంపతులు కలిసి మద్యపానం సేవించే సమయంలో ఇరువురి అలవాట్లను, అభిరుచులను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా సంబంధాన్ని బలోపేతం చేస్తుందని తెలిపింది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని నివేదికలో పేర్కొంది.

మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరా బిర్డిట్ తన పరిశోధనలో కలిసి ఆల్కాహాల్ తీసుకుంటున్న జంటలు మంచి సంబంధాలను కలిగి ఉంటారని నిరూపించారు. ఈ సిద్ధాంతాన్ని "డ్రింకింగ్ పార్టనర్‌షిప్" సిద్ధాంతం అని నామకరణం చేశారు.

ఇలా చేయడం వల్ల ఆయుర్థాయం పెరిగి జంటల్లో మరణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇది మితంగా సేవిస్తే అనుకూల ఫలితాలు వస్తాయని ఎక్కువగా సేవించడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుందని వివరించింది. దీనివల్ల ఒకరిమధ్య ఒకరికి ఘరణ వాతావరణం కూడా చోటు చేసుకోవచ్చని సూచించింది.

ఒకానొక సమయంలో అతిగా తాగడం వల్ల సంబంధం కూడా తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత మూడు నెలలుగా మితంగా మద్యం మద్యం సేవించిన జంటలు సంపూర్ణ ఆరోగ్యంగానూ, ఇతర జంటల కంటే ఎక్కువ కాలం జీవించారని డాక్టర్ బిర్డిట్ మరో ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

ఇది కేవలం కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల నుంచి తీసుకున్న వివరణే తప్ప వాస్తవంగా పరిశీలించలేదు. ఇలా చేయాలనుకుంటే డాక్టర్లు, నిపుణుల సలహామేరకే ప్రయత్నించాలి.




