- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Mumbai Indians Player Rohit Sharma Creates History In T20 Cricket
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్.. తొలి భారత ప్లేయర్‌గా..
IPL 2024 Rohit Sharma Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్ ద్వారా రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు కొట్టాడు. దీంతో క్రిస్ గేల్ (1056), కీరన్ పొలార్డ్ (860), ఆండ్రీ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాత ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Updated on: Apr 15, 2024 | 10:12 AM

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ (IPL 2024) 29వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబైకి శుభారంభం అందించిన హిట్‌మ్యాన్ 63 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లతో, టీ20 క్రికెట్‌లో 500+ సిక్సర్లు కొట్టిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదో బ్యాటర్‌గా నిలిచాడు.

అంతే కాకుండా రోహిత్ శర్మ T20 క్రికెట్‌లో 1000+ ఫోర్లు, 500+ సిక్సర్లు కొట్టిన 2వ బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఇంతకు ముందు ఇలాంటి ఘనత క్రిస్ గేల్ మాత్రమే చేశాడు.

455 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన క్రిస్ గేల్ 1132 ఫోర్లు, 1056 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు.

419 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 502 సిక్సర్లు, 1028 ఫోర్లు కొట్టాడు. దీని ద్వారా, అతను T20 క్రికెట్‌లో 1000+ ఫోర్లు, 500+ సిక్స్‌లు కొట్టిన మొదటి భారతీయుడు, ప్రపంచంలోని 2వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.




