- Telugu News Photo Gallery Cricket photos From Nicholas Pooran to Abhishek Sharma These 4 Players hit Most Sixes In IPL 2024
ఊరమాస్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్.. భారీ సిక్సులతో భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్లు వీరే.. లిస్టులో ఇద్దరు మనోళ్లే
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ టాప్-3 జాబితాలో ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. ఆర్‌సీబీ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ గత 6 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 12 సిక్సర్లు బాదాడు.
Updated on: Apr 15, 2024 | 12:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో నికోలస్ పూరన్ హావా కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తరపున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న పూరన్ ఇప్పుడు సిక్స్ హిట్టర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ 32 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఈ నాలుగు సిక్సర్లతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరి ఈసారి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో ఓసారి చూద్దాం..

1- నికోలస్ పూరన్: ఐపీఎల్ 2024లో పూరన్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో మొత్తం 138 బంతులు ఎదుర్కొన్నాడు. ఈక్రమంలో 19 భారీ సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టాడు.

2- రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ 6 మ్యాచ్‌ల్లో 183 బంతులు ఎదుర్కొని 18 సిక్సర్లు బాదాడు.

3- హెన్రిక్ క్లాసెన్: ఈ జాబితాలో మూడవది హెన్రిక్ క్లాసెన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్లాసన్ 5 మ్యాచ్‌ల్లో 96 బంతులు ఎదుర్కొని 17 సిక్సర్లు కొట్టాడు.

4- అభిషేక్ శర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ స్ట్రైకర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 85 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. ఇప్పటివరకు 16 సిక్సర్లు బాదాడు.




