బంగారం, వెండి పానీ పూరీ..! మోదీ గుజరాత్‌లో ఇదే చర్చ.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కే..!

ఈ పానీ పూరీపై బంగారు, వెండి పూతతో అలంకరించిన తర్వాత బంగారు ప్లేట్‌లోనే వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఈ పానీపూరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకోగా మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.

బంగారం, వెండి పానీ పూరీ..! మోదీ గుజరాత్‌లో ఇదే చర్చ..  వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కే..!
Gold And Silver Pani Purib
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2024 | 11:58 AM

పానీ పూరి.. అనే పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీ పూరిని గోల్ గప్పా, గప్ చుప్ మొదలైన అనేక పేర్లతో పిలుస్తారు. మీరు చాలా రకాల పానీ పూరీలను గురించి విని ఉంటారు. లేదంటే తినుంటారు కూడా. కానీ మీరు ఎప్పుడైనా బంగారం, వెండి పానీ పూరీలను తిన్నారా? బంగారం, వెండి పానీ పూరీ ఎలా ఉంటుందోనని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కాదా..? కానీ, ఇక్కడ అలాంటి పానీపూరీ విక్రయం జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ విక్రేత పానీ పూరీలో కొత్త వెర్షన్‌ను కనుగొన్నారు. ఈ పానీ పూరీలో డ్రై మీవ్, తండై ఉన్నాయి. ఈ పానీ పూరీపై బంగారు, వెండి పూతతో అలంకరించిన తర్వాత బంగారు ప్లేట్‌లోనే వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఈ పానీపూరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకోగా మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో వ్లాగర్లు ఖుష్బూ, మనన్ ఈ కొత్త పానీ పూరీని మనకు అందించారు. వీడియోలో చూపిన విధంగా – పానీ పూరీకి బాదం, జీడిపప్పు, పిస్తాలను కూడా యాడ్‌చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి తేనె కూడా కలుపుతూ కనిపిస్తారు. చివరగా ఆ పూరీలన్నీ ఒక ప్లేట్‌లో పెట్టి సర్వ్‌ చేసేందుకు సిద్ధంచేశారు. అందుకోసం ప్రతి పానీ పూరీని బంగారం, వెండి పూతతో అలంకరించారు. ఈ పానీ పూరీని బంగారు పళ్ళెంలో వడ్డిస్తున్నారు. ఈ పానీ పూరి పేరు షరీట్. ప్రస్తుతం ఈ పానీ పూరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వ్లాగర్లు ఖుష్బు, మనన్ ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా cherishing_the_taste_ నుండి షేర్‌ చేసారు. వీడియోకి ఇలాంటి శీర్షిక పెట్టారు..“సోనే-చండీచి పానీ పూరీ! దేశంలోనే తొలి క్లీన్‌ లైవ్‌ ఫ్రైడ్‌ పానీ పూరీ షరీట్‌ అంటూ.. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు,.. “మేము పది రూపాయలకు నాలుగు పానీ పూరీలు తినేవాళ్ళం. కాబట్టి “బ్రదర్, దీని ధర అయితే చెప్పండి అంటున్నారు చాలా మంది. ఈ రకమైన పానీ పూరీ నచ్చలేదంటున్నారు చాలా మంది.. దీంతో పలువురు ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం