Viral Video: ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు.. ఆ స్టెప్పులకు మైండ్ బ్లోయింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన "గుంటూరు కారం" చిత్రంలోని "కుర్చీ మడతపెట్టె" అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్, శ్రీలీల నటించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ లిరిక్స్, మాస్ డాన్స్ స్టెప్పులతో పాటు శ్రీలీల గ్లామర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

Viral Video: 'కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు.. ఆ స్టెప్పులకు మైండ్ బ్లోయింగ్
Kurchi Madathapetti
Follow us
Balu Jajala

|

Updated on: Apr 15, 2024 | 11:08 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన “గుంటూరు కారం” చిత్రంలోని “కుర్చీ మడతపెట్టె” అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్, శ్రీలీల నటించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్.. లిరిక్స్, మాస్ డాన్స్ స్టెప్పులతో పాటు శ్రీలీల గ్లామర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఓ ఊపు ఊపేసిన పాట ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరించింది.

ఇన్ స్టా రీల్స్ లో ఆఫ్రికన్ పిల్లలు కుర్చీ మడతపెట్టి సాంగ్ కు మైమరిచిపోయే డాన్సింగ్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అచ్చం మహేశ్ బాబులా స్టెప్పులు వేసి ఫిదా చేశారు. గ్రూప్ లో ఓ అమ్మాయి శ్రీలీల స్టెప్పులకు తగ్గట్టుగా డాన్సులు వేస్తే మిగతా పిల్లలను మహేశ్ స్టైల్ ను ఫాలో అయ్యారు. కాగా ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ ఫ్లాష్ మాబ్ ఈవెంట్ లో ఈ పాట దుమ్మురేపగా, ఇప్పుడు ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లలు తమలోని టాలెంట్ ను బయటపెడుతూ డాన్స్ చేశారు.

అప్పట్లో అల వైకుంఠపురములో బుట్టబొమ్మ సాంగ్ వైరల్ కావడం, సెలబ్రిటీలు, వివిధ దేశాలకు చెందినవారు రీల్స్ వేయడం చూశాం. కుర్చి మడతపెట్టి కోసం కూడా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు రీల్ చేయగా, కొందరు క్రికెటర్లు ట్రెండ్ ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లలు కుర్చీ మడతపెట్టి పాటకు దుమ్మురేపారు. ప్రస్తుతం ఈ పిల్లల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా వాచ్ చేయండి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.