AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇంటర్ విద్యార్థిని పై ప్రశంసలు కురిపించిన సామ్.. ఆమె అందరికి ఆదర్శం అంటూ..

కొటేషన్స్, మోటివేషన్స్ అంటూ రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తోంది.మధ్య మధ్యలో అభిమానులకు కిర్రెక్కించేలా అందాలతో అదరగొడుతోంది. క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇంటర్ విద్యార్థిని గురించి సామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆమె ఎంతో మందికి ఆదర్శం అని తెలిపింది సమంత ఇంతకు ఆ విద్యార్థిని ఏం సాధించింది.?

Samantha: ఇంటర్ విద్యార్థిని పై ప్రశంసలు కురిపించిన సామ్.. ఆమె అందరికి ఆదర్శం అంటూ..
Samantha
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2024 | 10:58 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది సామ్. ఇక ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. కొటేషన్స్, మోటివేషన్స్ అంటూ రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తోంది.మధ్య మధ్యలో అభిమానులకు కిర్రెక్కించేలా అందాలతో అదరగొడుతోంది. క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇంటర్ విద్యార్థిని గురించి సామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆమె ఎంతో మందికి ఆదర్శం అని తెలిపింది సమంత ఇంతకు ఆ విద్యార్థిని ఏం సాధించింది.? సామ్ ఎందుకు ఆమెను పొగిడింది.?

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని టాపర్ గా నిలిచింది. ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల ఇంటర్ లో టాపర్ గా నిలిచింది.  ఆమె  బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. దాంతో ఆమె పై సమంత ప్రశంసలు కురిపించింది.

నిర్మల బాల్యవివాహాన్ని అడ్డుకొని మరి చదువు పై దృష్టిపెట్టింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు.. వీరిలో ముగ్గురిని ఇప్పటికే వివాహం చేశారు. అలాగే నిర్మలకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయాలని చూశారు. అయితే నిర్మల ఆ బాల్య వివాహం నుంచి తప్పించుకుంది. ఇక ఇప్పుడు ఇంటర్ లో తన ప్రతిభ చాటి టాపర్ గా నిలిచింది. అంతే కాదు టెన్త్ లోనూ నిర్మల 537 మార్కులు సాధించింది. ఇప్పుడు ఇలా ఇంటర్ లో టాపర్ గా నిలిచింది. దాంతో చాలా మంది నిర్మల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సమంత కూడా నిర్మలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samantha

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..