Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: స్విగ్గీ డెలివరీ బాయ్‌కు సోనూ సూద్ అండ..మండిపడుతున్న నెటిజన్లు.!

Sonu Sood: స్విగ్గీ డెలివరీ బాయ్‌కు సోనూ సూద్ అండ..మండిపడుతున్న నెటిజన్లు.!

Anil kumar poka

|

Updated on: Apr 15, 2024 | 11:59 AM

కరోనా కష్టకాలంలో వేలాదిమందిని ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఆ తర్వాత కూడా ఎంతోమందిని ఆదుకున్నారు. సాయం కోరినవారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న అతడి మంచి హృదయానికి దేశం మొత్తం ఫిదా అయింది. తాజాగా ఆయన పేరు మరోమారు వార్తలకెక్కింది. ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కరోనా కష్టకాలంలో వేలాదిమందిని ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఆ తర్వాత కూడా ఎంతోమందిని ఆదుకున్నారు. సాయం కోరినవారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న అతడి మంచి హృదయానికి దేశం మొత్తం ఫిదా అయింది. తాజాగా ఆయన పేరు మరోమారు వార్తలకెక్కింది. ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ డెలవరీ బాయ్‌కు సోనూ సూద్ ఇప్పుడు అండగా నిలిచారు. బూట్లు చోరీ చేసిన అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు.

స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఎవరివైనా షూ చోరీ చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవడానికి బదులుగా కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. కాబట్టి దయగా ఉండండి అంటూ తన ఎక్స్ ఖాతాలో కోరారు. సోనూ సోద్ చేసిన ఈ సూచనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సోనూసూద్‌ మంచి మనసును ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం దొంగతనం ఏ రూపంలో ఉన్నా అది మంచిది కాదని అంటున్నారు. అతడిపై చర్యలు తీసుకోవద్దని చెప్పడం వరకు ఓకే కానీ, ఇలాంటి జస్టిఫికేషన్‌లు ఇవ్వడం సరికాదని మరికొందరు మండిపడుతున్నారు. పేదరికం, అవసరాలు కారణంగా చేసే చోరీని సమర్థించడం సరికాదని చెబుతున్నారు. ఈ డెలివరీ బాయ్ కంటే కూడా లక్షలాదిమంది ప్రజలు పేదలుగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. బతకడానికి మరింతగా కష్టపడాలని, అంతేకానీ, దొంగతనం కూడదని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..