AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కల నిజమైంది..! కష్టపడి కొనుకున్న ఆటో ముందు డ్రైవర్‌ ఏం చేశాడో చూస్తే..

ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. 'కష్టం ఫలించింది', 'ఉన్నదానిని మనం ఆస్వాదించగలగాలి' అని పలువురు చెబుతుంటే, కొందరు రిక్షా డ్రైవర్ చేసిన పనిని అభినందిస్తున్నారు. చాలా మంది ఎమోజీలతో స్పందించారు.

Watch Video: కల నిజమైంది..! కష్టపడి కొనుకున్న ఆటో ముందు డ్రైవర్‌ ఏం చేశాడో చూస్తే..
A Selfie With A Rickshaw
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2024 | 12:46 PM

Share

ప్రతి ఒక్కరికీ జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. గొప్ప గొప్ప ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఏదో చేయాలని, మరింకేదో సాధించాలని కలలు కన్నుంటారు. కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఆ సమయం కోసం ఎంతో సహనంతో ఎదురు చూడాల్సి ఉంటుంది. అలా ఒక సామాన్యుడు తను కలనెరిన క్షణంలో అతడి ఆనందం ఆకాశాన్ని అందుకుంటుంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ గా మారింది. మనం కష్టపడి కొనుకున్న ఇల్లు, కారు మనకు వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి. ఆ సంతోష క్షణాలను గుర్తుగా ఫోటో తీసి భద్రంగా దాచుకుంటాం. అలాగే, ఇక్కడ ఒక వ్యక్తి సొంతంగా ఆటో రిక్షా కొనాలనే కల నిజం కావడంతో అతడు.. తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. అతని ముఖంలో కొత్త రిక్షా కొనుక్కున్న ఆనందం కనిపిస్తుంది. రిక్షా కొన్న తర్వాత అతను చేసిన పని వైరల్ వీడియోలో చూడండి.

వైరల్‌ వీడియోలో ఒక అతను కొత్త ఆటో రిక్షా కొన్నాడు. ఈ కొత్త రిక్షాతో బయల్దేరిన అతడు..మార్గ మధ్యలోనే రోడ్డుపై ఆపి నేలపై మోకరిల్లి తన ఫోన్‌లో రిక్షాతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో X (Twitter) ఖాతా @Gulzar_sahab నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. ‘కష్టపడి ఏదైనా కొనుక్కోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘కష్టం ఫలించింది’, ‘ఉన్నదానిని మనం ఆస్వాదించగలగాలి’ అని పలువురు చెబుతుంటే, కొందరు రిక్షా డ్రైవర్ చేసిన పనిని అభినందిస్తున్నారు. చాలా మంది ఎమోజీలతో స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..