Fruit For Weight Loss: ప్రతిరోజూ ఈ పండు తినండి.. నెలరోజుల్లోనే మీరు స్లిమ్‌గా అవుతారు..డోన్ట్‌ మిస్..!

మార్కెట్‌లో అతి తక్కువ ధరలో దొరికే ఒక చవకైన పండు..ఈ పండును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటా పండును మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. సపోటా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Fruit For Weight Loss: ప్రతిరోజూ ఈ పండు తినండి.. నెలరోజుల్లోనే మీరు స్లిమ్‌గా అవుతారు..డోన్ట్‌ మిస్..!
సపోటా జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది. సపోటా తింటే.. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ వెంటనే అందుతుంది. సపోటా పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 14, 2024 | 11:09 AM

సపోటా పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ని సులభంగా తగ్గించుకోవచ్చు. సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ ఉన్నాయి. ఇవి మీ నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాను ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సపోటా పండు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇది మన శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగిస్తుంది. అంతేకాకుండా, సపోటా పండులో సహజ చక్కెర ఉంటుంది. బరువు పెరుగుతారనే భయం లేదు. సపోటా పండు హాయిగా తినవచ్చు. సపోటా పండు తింటే షుగర్ పెరుగుతుందన్న భయం అక్కర్లేదు. ఇందులోని విటమిన్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో సపోటా సహకరిస్తుంది. సపోటాలు తింటే.. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ తక్షణమే లభిస్తుంది సపోటా పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సపోటా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు పెరగడానికి కారణం కాదు. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. మన ఆహారంలో సపోటా పండును చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ.. కంటి సమస్యలు దూరం చేస్తుంది. అంతేకాదు.. నిద్రలేమి, ఒత్తిడితో బాధపడే వారు తరచూగా సపోటా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సపోటా పండు రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నివారిస్తుంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సపోటాలో ఉండే బీ-సీ విటమిన్స్ వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌.. ఎముకల్ని బలపరుస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వాన్ని సపోటా నివారించడంలో తోడ్పడుతుంది. సపోటా పండు మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. ఇవి చాలా తక్కువ ధరలకే లభిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చు. అలాగే, స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను తగ్గించడంలోనూ సపోటా పనిచేస్తుంది. ఈ పండ్లు మన జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడతాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సపోటా పండును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇతర పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనితో మీరు రుచిని ఆస్వాదిస్తూ సులభంగా బరువు తగ్గవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…