- Telugu News Photo Gallery These Are The Health Benefits Of Drinking Chamomile Tea Telugu Lifestyle News
Chamomile Tea: చామంతి టీతో చెప్పలేని లాభాలు..! రాత్రి నిద్రపోయే ముందు ఈ టీ తాగితే..
Chamomile Tea Benefits: చామంతి పువ్వులతో తయారు చేసిన అద్భుతమైన టీ తాగితే అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఈ చామంతి టీ ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. చామంతి టీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చామంతి టీ అద్భుత రుచి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి.
Updated on: Apr 14, 2024 | 11:58 AM

చామంతి టీలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంగ్జయోలిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ టీ తీసుకోవడం వల్ల సుఖమైన నిద్ర పొందవచ్చు. చామంతి టీ.. ఒక సున్నితమైన రిలాక్సెంట్‌గా, ఒత్తిడిని తగ్గించే న్యాచురల్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది మీ మనస్సును ప్రశాంతమైన స్థితిలోకి తీసుకొస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. చామంతి టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, వాంతులు, విరేచనాలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

చామంతి టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చామంతి టీ తాగటం వల్ల ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చామంతి టీకి నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి, పీరియడ్ నొప్పి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

చామంతి టీ న్యాచురల్ పెయిన్ రిలీవర్‌గా పనిచేస్తుంది. కుడుపు నొప్పి, నెలసరి నొప్పి, అతీర్తి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కెమిస్ట్రీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం చామంతి టీలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి, ఇది నొప్పులను తగ్గిస్తుంది. గర్భాశయాన్ని సడలించడం, నొప్పిని కలిగించే పదార్థాల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా.. నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

ప్రస్తుత లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్ల కారణంగా.. గుండె సమస్యలతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు చామంతి టీ తాగితే.. గుండె ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు అంటున్నారు. చామంతి టీలో.. మెండుగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి.

చామంతిలోని ఫ్లైవనాయిడ్స్ ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. క్రమం తప్పకుండా చామంతి టీ తాగడం వల్ల హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది ఒత్తడిని తగ్గిస్తుంది, నిద్రను ప్రోత్సహిస్తుంది, రక్తనాళాలు, ధమనులను రిలాక్స్ చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.




