- Telugu News Photo Gallery Cricket photos Team India Former Player Mohammad Kaif's Indian Squad For T20 World Cup 2024
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇదే.. ఆ ముగ్గురికి షాక్?
T20 World Cup 2024: ప్రపంచ కప్ 2024ను వెస్టిండీస్, USA సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో కొన్ని మ్యాచ్‌లకు USA ఆతిథ్యం ఇవ్వనుండగా, సూపర్-8 దశలోని అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతాయి.
Updated on: Apr 14, 2024 | 11:52 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభమవుతుంది. యూఎస్‌ఏ-వెస్టిండీస్‌లో జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ తమ జట్లను మే 1లోగా ప్రకటించాల్సి ఉంది.

ఐపీఎల్‌లో ఆటతీరును పరిగణనలోకి తీసుకుని పటిష్టమైన భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఎలా ఉండాలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు.

మహ్మద్ కైఫ్ త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో రింకూ సింగ్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌లకు చోటు దక్కకపోవడం విశేషం. బదులుగా శివమ్ దూబే, రియాన్ పరాగ్ ఎంపికయ్యారు.

అలాగే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది. పేసర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు కల్పించారు. దీని ప్రకారం మహ్మద్ కైఫ్ ఎంపిక చేసిన భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ఎలా ఉందో ఓసారి చూద్దాం..

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే, ర్యాన్ సిరాజ్, మహ్మద్ దూబే.




