AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ప్రెజర్‌ కుక్కర్‌లో చేసిన చపాతీలు..! వేరీ డేంజర్‌ అంటూ నెటిజన్లు ఫైర్‌..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చపాతీ మేకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ ఒక ఇల్లాలు నిమిషాల వ్యవధిలో ప్రెషర్ కుక్కర్‌లో రోటీలు వండుతున్న దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లిప్‌లో ముందుగా ఆమె తడిపిన పిండితో ఐదారు రోటీలను కొంచం పెద్ద సైజు పూరీళ్ల తయారు చేసింది. ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టింది.

Watch Video: ప్రెజర్‌ కుక్కర్‌లో చేసిన చపాతీలు..! వేరీ డేంజర్‌ అంటూ నెటిజన్లు ఫైర్‌..
Pressure Cooker Rotis
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2024 | 10:22 AM

Share

చపాతి.. చాలా మందికి ఇష్టమైన ఫుడ్‌ ఐటమ్‌. అన్నం బదులు వీటిని తింటుంటారు. బరువు తగ్గేందుకు చాలా మంది చపాతీ, రోటీలే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. అయితే, అందరికీ చపాతీలు చేయటం ఇష్టం ఉండదు.. ఎక్కువ మంది చపాతీలు మొత్తగా రావని, గుండ్రంగా ఉండవని కంగారుపడుతుంటారు. ఒక్కొ చపాతీ చేస్తూ..వాటిని పెనంపై కాల్చటం కూడా పెద్ద టాస్క్‌లా భావిస్తారు. ఒక్కోక్కటి కాల్చుకుంటూ పోయ్యిదగ్గర ఉండాలంటే.. వేడి ఉక్కపోతతో బేజారు పడుతుంటారు. అలా కాకుండా ఓ ఇల్లాలు అద్భుతమైన ఉపాయం చేసింది. చపాతీలు కాలుస్తూ స్టైవ్‌ దగ్గర ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త పద్ధతిలో చపాతీలు ప్రిపేర్‌ చేసింది. ఈ యూజర్ ఏ సమయంలోనైనా రోటీలు చేయడానికి సిద్దపడేలా సులభమైన హ్యాక్‌ను కనిపెట్టింది. కానీ ఇది నిజంగా అంత ప్రభావవంతంగా ఉంటుందా అనేది మాత్రం ట్రై చేస్తే గానీ, తెలియదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చపాతీ మేకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ ఒక ఇల్లాలు నిమిషాల వ్యవధిలో ప్రెషర్ కుక్కర్‌లో రోటీలు వండుతున్న దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లిప్‌లో ముందుగా ఆమె తడిపిన పిండితో ఐదారు రోటీలను కొంచం పెద్ద సైజు పూరీళ్ల తయారు చేసింది. ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టింది. ఆ తర్వాత కుక్కర్ లోపల ఒక చిన్న బౌల్ ఉప్పు వేసింది. ఆ ఉప్పునైన స్టీల్ గిన్నె ఒకటి పెట్టింది. తర్వాత, ఆ గిన్నెపై ఒక్కో రోటీని పేర్చింది. చివరగా, కుక్కర్‌ను లాక్‌ చేసింది. కొంత సమయం తరువాత ఆమె మూత తెరిచి చూడగా, సరిగ్గా మొత్తగా ఉడికిన చపాతీలు తయారైనట్టుగా చూపించింది. ఆపై ఒక్కో చపాతీ తీసుకుని వాటిపై కొద్దిగా నెయ్యి రాసింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమై అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఇది ఎడిట్ చేసిన వీడియో అంటున్నారు. అంతేకాదు. ఇది డేంజర్‌ అని, నీళ్లు లేకుండా ఇలా లాక్‌ చేయటం వల్ల కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి తప్పుదారి పట్టించే వీడియోలకు వ్యతిరేకంగా చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర, అసమర్థమైన హ్యాక్‌లను పోస్ట్ చేయవద్దంటూ మరికొందరు ఆన్‌లైన్ వినియోగదారులు కోరుతున్నారు. దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..