AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఎద్దు.. అమాంతం ఎగిరి లారీ కిందపడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేం..!

ఆ రోడ్డుపై సాధారణంగా వచ్చే పోయే వాహనాల రద్దీ కాస్త తక్కువగానే ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు మామూలుగానే నడుస్తూ వెళ్తున్న ఆ ఎద్దు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎదురుగా వస్తున్న ఓ స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి అమాంతంగా ఎగిరి లారీ కిందకు పడ్డాడు..

Watch Video: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఎద్దు.. అమాంతం ఎగిరి లారీ కిందపడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేం..!
Scooter rider fell under the truck
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2024 | 8:28 AM

Share

రోడ్డుపై బైక్‌లు, స్కూటర్లు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. బైక్, స్కూటర్ ఎంత జాగ్రత్తగా నడిపినా ఒక్కోసారి మనది కాని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ సిలికాన్ సిటీ బెంగుళూరులో జరిగిన ప్రమాద దృశ్యం. అవును.. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ స్విమ్మింగ్ పూల్ జంక్షన్ దగ్గర ఈ షాకింగ్ ఘటన జరిగింది. వీడియోలో ఒక మహిళ ఎద్దును వెంటబెట్టుకుని రోడ్డు వెంట నడుస్తోంది. ఆ ఎద్దుకు ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ ఎద్దు హఠాత్తుగా దాని విశ్వరూపం ప్రదర్శించింది. ఎదురుగా ఒక స్కూటర్‌ పై వస్తున్న ఒక వ్యక్తిపై దూకింది. అదే సమయంలో ఆ పక్కగానే ఓ లారీ కూడా వస్తోంది. అంతే అతడు స్కూటర్‌పై నుంచి ఎగిరి పడ్డాడు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

వైరల్‌ వీడియోలో ముందుగా ఒక మహిళ ఎద్దును వెంటబెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ రోడ్డుపై సాధారణంగా వచ్చే పోయే వాహనాల రద్దీ కాస్త తక్కువగానే ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు మామూలుగానే నడుస్తూ వెళ్తున్న ఆ ఎద్దు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎదురుగా వస్తున్న ఓ స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి అమాంతంగా ఎగిరి లారీ కిందకు పడ్డాడు.. అయితే ట్రక్కు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ వెంటనే బ్రేక్ వేయటంతో స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఆ ట్రక్కు డ్రైవర్‌ కాస్త ఏమరపాటుగా ఉన్నకూడా స్కూటర్ తో పాటు దానిపై వస్తున్న ఆ వ్యక్తి నుజ్జునుజ్జు అయ్యి ఉండేవాడు. ప్రస్తుతం ఈ షాకింగ్‌ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి కాబట్టి..అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుపై పడిన వెంటనే లేచి నిలబడ్డాడు. కానీ, స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షిస్తూ.. రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..