- Telugu News Photo Gallery Health Benefits of Ummetha Flower Ummetta Plant in Ayurveda Telugu Lifestyle News
ఉమ్మెత్త.. ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపడినట్టే..! ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు, ఆకులు, పూలు, కాయలు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఔషధ మొక్కలలో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు లో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక స్థానం కల్పించారు..! ఉమ్మెత్త ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 13, 2024 | 12:21 PM

ఉమ్మెత్త ఆకులు అద్భుతమైన నొప్పి నివారిణిగా పనిచేస్తాయి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశం లో నైనా నొప్పిగా ఉంటే వెంటనే.. ఒక ఉమ్మెత్త ఆకు తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి.. నొప్పి ఉన్న చోట రాసి కట్టుకడితే ఆ నొప్పులన్నీ పరారవుతాయి చెబుతారు.

తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్న వారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లోని కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది.

ఉమ్మెత్త ఆకులతో వైద్యం అధిక బరువును తగ్గిస్తుంది. వేడి కురుపులు, సెగ గడ్డలు, స్త్రీలలో స్తనాల వాపు వంటి సమ్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడిచేసి కట్టుకడితే త్వరగా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సాధారణంగా కోతి, పిచ్చికుక్క కరిచిన వారికి కూడా ఉమ్మెత్త ఆకులతో వైద్యం చేస్తారు. ఇందుకోసం ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కోతి కరిచిన చోట, పిచ్చి కుక్క కరిచిన చోట రసం రాసి మర్దనా చేస్తే వాటి విషం శరీరానికి పాకదని నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మెత్త ఆకుల రసాన్ని గజ్జి, తామర, దురద, పుండ్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. తలలో పేలు, కురుపులు ఉన్నవారు.. ఈ ఆకుల రసాన్ని ఆముదం కలిపి రాస్తే పెలు పోయి, కురుపులు మానిపోతాయి. అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఉంటే ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే పేనుకొరుకుడు పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.




