- Telugu News Photo Gallery Wearing A Copper Ring Gives All These Benefits Gets Rid Of Big Defects Telugu Lifestyle News
బంగారం, వెండి, వజ్రాలు కాదు.. రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలుసా..?
Copper Ring Importance: రాగి ఉంగరాన్ని ధరించే సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. జ్యోతిషశాస్త్రంలో, రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగిని సూర్యుడు, అంగారకుడి లోహంగా పరిగణిస్తారు. రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Updated on: Apr 13, 2024 | 12:45 PM

సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతుంటారు. రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు కానీ ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు చాలావరకు తగ్గుతాయి.

పొట్ట సమస్యలు దూరమవుతాయి - కాపర్ రింగ్ లేదా బ్రాస్లెట్ ధరించడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీనితో పాటు రాగి ఆభరణాలు ధరించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. ఆర్థరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరించాలి.

సూర్య,అంగారక దోషాలు తొలగిపోతాయి - ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్య దోషం తొలగిపోతుంది. సూర్యునితో పాటు, అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

సరైన రక్త ప్రసరణ కోసం- రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని కూడా తాగవచ్చు.

వాస్తు దోషాలు తొలగిపోతాయి - వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం, శాంతిని కాపాడతాయి. దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం తప్పుడు దిశలో ఉంటే రాగి నాణేన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు.




