Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భద్రాద్రి రాములోరి కల్యాణానికి 3డీ పట్టు చీర నేసిన సిరిసిల్ల కళాకారుడు.. సీతమ్మకు చిరు కానుక

సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని ఈ కళాకారుడు మరోసారి ప్రపంచానికి చాటాడు. బంగారు నూలు పోగులతో మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కల్యాణానికి సీతమ్మకు బహూకరించేందుకు ప్రత్యేకంగా త్రీడీలో మూడు వర్ణాలతో పట్టు చీరను అద్భుతంగా మగ్గంపై నేశాడు సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్‌..

Telangana: భద్రాద్రి రాములోరి కల్యాణానికి 3డీ పట్టు చీర నేసిన సిరిసిల్ల కళాకారుడు.. సీతమ్మకు చిరు కానుక
Sri Rama Navami Celebration
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 15, 2024 | 7:51 AM

సిరిసిల్ల, ఏప్రిల్ 15: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని ఈ కళాకారుడు మరోసారి ప్రపంచానికి చాటాడు. బంగారు నూలు పోగులతో మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కల్యాణానికి సీతమ్మకు బహూకరించేందుకు ప్రత్యేకంగా త్రీడీలో మూడు వర్ణాలతో పట్టు చీరను అద్భుతంగా మగ్గంపై నేశాడు సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్‌. ఆదివారం ఈ పట్టు చీరను ఆవిష్కరించాడు.

ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై ఈ చీరను నేశాడు. అందుకు బంగారం, వెండి జరి, రెడ్‌ బ్లడ్‌ రంగులతో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో చీరను తయారు చేశాడు. అద్భుతమైన ఈ త్రీడీ చీరను తిప్పుతుంటే మూడు వర్ణాల్లో రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం (ఏప్రిల్‌ 17) న జరగనున్న శ్రీరామ నవమి పండుగకు భద్రాచలం సీతారాముల వివాహమహోత్సవానికి ఈ చీరను బహూకరించనున్నట్లు ఆయన తెలిపారు.

కాగా సిరిసిల్ల నేత కళాకారుడు విజయ్‌కుమార్‌ ఇలాంటి అద్భుతమైన చీరలను నేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్‌ నేసి పలువురి అభినందనలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.