తెలంగాణలో తెరపైకి కొత్త రాజకీయం.. సీఎం రేవంత్‎పై బీజేపీ, బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలతో సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి చర్చ మొదలైంది. రేవంత్‌ సమర్థుడే కానీ.. కాంగ్రెస్‌లో ఉంటే అసమర్థుడిగా మారిపోతారని సెటైర్లు వేశారు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ప్రచాంలో జోష్ పెంచాయి.

తెలంగాణలో తెరపైకి కొత్త రాజకీయం.. సీఎం రేవంత్‎పై బీజేపీ, బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Follow us

|

Updated on: Apr 15, 2024 | 7:39 AM

బీజేపీ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలతో సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి చర్చ మొదలైంది. రేవంత్‌ సమర్థుడే కానీ.. కాంగ్రెస్‌లో ఉంటే అసమర్థుడిగా మారిపోతారని సెటైర్లు వేశారు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ప్రచాంలో జోష్ పెంచాయి. జాతీయపార్టీలు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశాయి. పైగా మరో మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్లలు తీవ్ర దుమారంగా మారాయి. ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని, మరో ఏక్‌నాథ్‌ షిండే అవుతారని ఈ మధ్య బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న వాటికి బలం చేకూరుస్తూ రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. అంతేకాదు..రేవంత్‌కు 15 ఏళ్ల రాజకీయ జీవితం ఉందన్న ఆయన.. కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని విమర్శించారు. సీఎం రేవంత్ సమర్థుడేకానీ.. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారన్నారు.

రేవంత్‌రెడ్డి పక్కా హిందూ అయితే జ్ఞానవాపీ, మధురపై తన నిర్ణయమేమిటో చెప్పాలన్నారు ధర్మపురి అర్వింద్‌. రేవంత్ హాజరైన ఆప్‌ కీ అదాలత్ షో పెద్ద కామెడీ షోగా మారిందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా 30 ఎంపీ సీట్లు కూడా రావు అని జోష్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో ఏకనాథ్ షిండేలు లేరని.. ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి. మొత్తానికి మరోసారి ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలతో రేవంత్‌రెడ్డిపై చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!