Peddapalli Politics: కీలకం కానున్న సింగరేణి కార్మికుల ఓట్లు.. ముగ్గురిలో గెలుపెవరిది..?

పార్లమెంటు ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి.. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు ప్రచార స్పీ‌డ్‌ను పెంచాయి. మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు అయిన నేపథ్యంలో ప్రచారంలో ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కలిసి ఓటును అభ్యర్థిస్తున్నాయి. ఈ మూడు పార్టీల నాయకులు గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Peddapalli Politics: కీలకం కానున్న సింగరేణి కార్మికుల ఓట్లు.. ముగ్గురిలో గెలుపెవరిది..?
Brs Bjp Congress
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Apr 14, 2024 | 5:07 PM

పార్లమెంటు ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి.. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు ప్రచార స్పీ‌డ్‌ను పెంచాయి. మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు అయిన నేపథ్యంలో ప్రచారంలో ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కలిసి ఓటును అభ్యర్థిస్తున్నాయి. ఈ మూడు పార్టీల నాయకులు గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పెద్దపల్లి ‌పార్లమెంటు పరిధిలో మూడు పార్టీల అభ్యర్థులు గత పదిహేను రోజుల నుండి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గడ్డం‌ వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ పార్లమెంటు పరిధిలోని ఏడు ఆసెంబ్లీ‌ స్థానానలని కైవసం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటి ఇవ్వలేక పోయాయి. కాంగ్రెస్ ‌టికెట్ విషయంలో మొదట విభేదాలు ఉన్నప్పటికీ తరువాత సద్దుమణిగాయి. ఇప్పుడు ‌లోక్‌సభ‌ పరిధిలోని ఏడుగురు ‌ఎమ్మెల్యేలు‌ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు.

ఇక్కడ అత్యధికంగా సింగరేణి ‌కార్మికులు‌ ఉన్న కారణంగా వారి ఓట్లని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని పార్టీలు. వంశీకృష్ణ నాన్న, పెద్ద నాన్న ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దాదాపుగా అసెంబ్లీ ‌కేంద్రాలతో పాటు, మండల కేంద్రాలు మేజర్ గ్రామ పంచాయతీలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీఅర్ఎస్, బీజేపీ పైనా విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాన్ చేశాయని కాంగ్రెస్ నేతలు బలంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. కార్మికుల ఓట్లకు గాలం వేసి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అటు, మాజీ మంత్రి కొప్పుల ‌ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈయన గతంలో సింగరేణి కార్మికుడు కావడంతో సింగరేణి కార్మికుల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొత్త ఉద్యోగాల కల్పన, కార్మికుల సమస్యలను పరిష్కరించమని ప్రస్తావిస్తున్నారు. తమ ఉద్యమం ‌కారణంగానే సింగరేణి ప్రైవేటీకరణ ‌కాలేదని సమావేశాలలో‌ గుర్తు చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు అటకెక్కాయని, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతులకు ఇబ్బందులు వచ్చినా అటువైపు చూడని కాంగ్రెస్ కి గుణపాఠం ‌తప్పదని కొప్పుల విపర్శిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి గోమాస‌ శ్రీనివాస్ పూర్తిగా‌ మోదీ‌ హావానే నమ్ముకున్నారు. అయన సామజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని‌ భావిస్తున్నారు. కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గుణపాఠం తప్పదని అంటున్నారు. రాష్ట్రంలో ‌అధికారం కోల్పోయిన బీఅర్ఎస్‌కు ఓటు వేసిన వృధా అని విమర్శలు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని వేడేక్కిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…