AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: కాలుష్య కుంపటిగా కరీంనగర్.. ఊపిరి బిగపట్టి బతుకుతున్న జనం.. పొంచి ఉన్న ముప్పు!

స్మార్ట్ సిటీ కరీంనగర్ వాసులు పొగతో ఉక్కిరి అవుతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండా కాలంలో వేడి తోపాటు ఊపిరి అడనివ్వని పొగతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడిదీ ఈ పొగ అని ఆరా తీస్తే.. డంప్ యార్డ్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. నగరం మొత్తం పొగతో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురుతున్నారు. నగర ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భయం..భయంగా బతుకుతున్నారు. పట్టిపీడిస్తున్న పొల్యూషన్ ప్రాణాలనే తోడేస్తోంది.

Karimnagar: కాలుష్య కుంపటిగా కరీంనగర్.. ఊపిరి బిగపట్టి బతుకుతున్న జనం.. పొంచి ఉన్న ముప్పు!
Karimnagar Pollution
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 14, 2024 | 4:36 PM

Share

స్మార్ట్ సిటీ కరీంనగర్ వాసులు పొగతో ఉక్కిరి అవుతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండా కాలంలో వేడి తోపాటు ఊపిరి అడనివ్వని పొగతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడిదీ ఈ పొగ అని ఆరా తీస్తే.. డంప్ యార్డ్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. నగరం మొత్తం పొగతో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురుతున్నారు. నగర ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భయం..భయంగా బతుకుతున్నారు. పట్టిపీడిస్తున్న పొల్యూషన్ ప్రాణాలనే తోడేస్తోంది.

కరీంనగర్ మొత్తంగా మేఘాల రూపంలో అలుముకుంది. ఈ వాతావరణం చూసి అదేదో హిల్ స్టేషన్ అనుకుంటున్నారేమో.. కానే కాదు.. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం… ఈ పొగ ఏదో శీతల ప్రదేశంలో కనిపించే పొగమంచు కాదు. ప్రాణాలు తీసే విషవాయువులు ఉన్న ప్రమాదకరమైన ధూమం. కరీంనగర్ ని ఆనుకుని ఉండే డంపింగ్ యార్డ్ నుండి గత రెండు మూడు రోజులుగా వస్తున్న ఈ పొగ నగరాన్ని కమ్మేసింది. కరీంనగర్ – పెద్దపల్లి బైపాస్ రోడ్డుతో పాటుగా, హైదరబాద్ కరీంనగర్ రాజీవ్ రహాదారిపై కూడా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఈ పొగ వ్యాపిస్తోంది.

ఇక కరీంనగర్‌లోని కమాన్ చౌరస్తా, ఆటో నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ ఇలా సగం నగరాన్ని పొగ కమ్మేస్తోంది. దీంతో స్థానికంగా నివాసముండే వారికి అనారోగ్య సమస్యలు ఒకవైపు అయితే, మరోవైపు రాజీవ్ రహాదారిపై ప్రయాణించే వాహానదారులకు మద్యహ్నం కూడా ముందు వెళ్లే వాహానం కనపడక ఇబ్బందలు పడుతున్నారు. ప్రతి ఎండా కాలం ఇలాంటి పరిస్థితే వస్తుండటంతో జనం నానావస్థలు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించకపోవడంతో నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు తప్పడం లేదు. ఎండా కాలం వచ్చిందంటే చాలు డంపింగ్ యార్డులో ఎప్పుడు మంటలు అంటుకుంటాయో అనే అందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

డంపింగ్ యార్డులో పడేసే వివిద రకాల వ్యర్థాలు ఈ మంటల్లో కాలిపోతూంటాయి. దీంతో రసాయనాలు కలిసిన వస్తువులు, ప్లాస్టిక్ వస్తువు, జంతు కళయబరాలు ఇలా అన్ని పొగ రూపంలో జనం మధ్యలోకి వస్తున్నాయి. దీంతో ఈ పొగ పీల్చుకుంటున్న వారిలో చాల మందికి శ్వాసకోస సమస్యలతో పాటుగా, చర్మరోగాల బారిన పడుతున్నారు. ఇక, డంపింగ్ యార్డులో పనిచేసే కార్మికుల పరిస్థితి మరీ దారుణం. ఇలా మంటలు అంటుకున్న సమయంలో పొగలో పనిచేయలేక, పని మానేయలేక వారు పడే నరకం అంతా ఇంతా కాదు. ఈ దుర్గందం భరించలేక కొంతమంది కార్మికులు సెలవులపై వెళ్తుండగా, తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరు కార్మికులు ఇలా పొగ పీల్చుతూనే పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి..నిజానికి డంపింగ్ యార్డు సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటయించి, బయో మైనింగ్ చేసేందుకు ఏర్పాట్ల చేసింది. కానీ ఈ బయో మైనింగ్ ఆగిపోయి చాలా నెలలు కావస్తూండటంతో చెత్త ఎక్కడిక్కడే ఉండిపోయి ఎండ వేడిమికి తగలబడుతోంది.

కరీంనగర్ లోని దాదాపు 90 వేల ఇండ్ల నుండే కాకుండా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్దల నుండి నిత్యం 120 మెట్రిక్ టన్నుల గార్బెజ్ ఈ డంపింగ్ యార్డుకి చేరుతోంది. ఇలా గత 50 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిత్యం కరీంనగర్ వాసులకు నరకం చూపిస్తోంది. బయో మైనింగ్ చేయడం, అంతటి చెత్తని నిర్దిష్ట సమయంలో తీసివేయడం ప్రాక్టికల్ గా కుదరకపోవడంతోనే ఈ సమస్య ఇలానే ఉండిపోయందంటున్నారు అధికారులు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలంటూ కరీంనగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం అయినా కరీంనగర్ ప్రజల బాధను వింటుందా..? ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుందా అనేదీ చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…