Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కొత్త – పాత నేతల మధ్య రాజుకున్న అగ్గి..!

పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తీసుకొస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు వర్గ విభేదాశాలతో తన్నుకుంటున్నారు. కొత్త-పాత నేతల మధ్య సమన్వయలోపంతో రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన రెండు సమావేశాలు రచ్చరచ్చయ్యాయి.. చిరవకు పోలీసులు ఓ వర్గం కార్యకర్తలను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కొత్త - పాత నేతల మధ్య రాజుకున్న అగ్గి..!
Congress
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Apr 14, 2024 | 8:29 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తీసుకొస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు వర్గ విభేదాశాలతో తన్నుకుంటున్నారు. కొత్త-పాత నేతల మధ్య సమన్వయలోపంతో రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన రెండు సమావేశాలు రచ్చరచ్చయ్యాయి.. చిరవకు పోలీసులు ఓ వర్గం కార్యకర్తలను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ కేడర్‌ను సిద్ధం చేస్తున్న నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఒక్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గ లో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు రచ్చరచ్చ అయ్యాయి. ఆదివారం పరకాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖను ఆహ్వానించకపోవడంతో కొండ వర్గీయులు భగ్గుమన్నారు.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ కొండ వర్గీలను అనగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాలు బాహాబాహికీ దిగారు.

మంత్రి కొండా సురేఖ vs ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి కొండా సురేఖ వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగి పోయిన కొండా వర్గీయులు కొందరు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పొరుగు నియోజక వర్గం నుండి పరకాలకు వలస వచ్చినా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై నమ్మకంతో గెలిపిస్తే తమను తొక్కేస్తున్నాడని ఆరోపించారు.

ఎప్పటినుండో పార్టీ కోసం పని చేస్తున్న వారిని పక్కనపెట్టి తన అనుచర వర్గాన్ని, కొత్తగా పార్టీలో చేరిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..పార్లమెంట్ నియోకవర్గ స్థాయి సమావేశానికి జిల్లా మంత్రి ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. గతంలో ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖను ఆహ్వానించక పోవడం దారుణం అని నిలదీశారు

మరోవైపు ఇదే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తిలో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీరెడ్డి నేతృత్వంలో పార్టీలోకి చేరికలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఝాన్సీరెడ్డి అక్కడి వెళ్లి పోయారు. మరోవైపు పోలీసులు ఒకవర్గం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చూడాలి మరీ లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారి తీస్తాయో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…