AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh Encounter: ఆ 29 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పాటిలింగం బుధవారం (ఏప్రిల్ 17) మీడియాకువెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. కాంకేర్‌ అడవుల్లో..

Chhattisgarh Encounter: ఆ 29 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
Chhattisgarh Encounter
Srilakshmi C
|

Updated on: Apr 18, 2024 | 11:03 AM

Share

ఛత్తీస్‌గఢ్‌, ఏప్రిల్‌ 18: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పాటిలింగం బుధవారం (ఏప్రిల్ 17) మీడియాకువెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. కాంకేర్‌ అడవుల్లో సమావేశం అయ్యారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ యాంటీ మావోయిస్టులు పేరిట నిర్వహించారు.

ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఏకే-47లు, కార్బైన్‌, 303 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇన్‌సాస్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్, కాంకేర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇంద్ర కళ్యాణ్‌ ఎల్లిసెల వెల్లడించారు.  బస్తర్‌ రేంజ్‌లో జరిగిన అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని ఆయన అన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మరి కొందరు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్‌ శంకర్‌రావు ఉన్నట్లు తొలుత భావించారు. అయితే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ మురళి, అలియాస్‌ శంకర్‌గా గుర్తించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది మృతుల పేర్లను మీడియాకు వెల్లడించారు. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించిన వారు వీరే

  • మావోయిస్టు పార్టీ డీకే టాప్‌ కమాండర్‌ సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ రావు
  • డీసీఎస్, సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ భార్య దాశశ్వర్‌ సుమన అలియాస్‌ రజిత
  • జన తన సర్కార్‌ కమిటీ ఇన్‌చార్జి లలిత (డీవీసీ మెంబర్)
  • నార్త్‌ బస్తర్‌ మెంబర్‌ మాధవి
  • పర్థాపూర్‌ ఏరియా కమిటీ జగ్ను అలియాస్‌ మాలతి
  • పర్థాపూర్‌ ఏరియా కమిటీ మెంబర్‌ రాజు సలామ్‌ అలియాస్‌ సుఖాల్
  • పర్థాపూర్‌ ఏరియా కమిటీ మెంబర్‌ వెల సోను అలియాస్‌ శ్రీకాంత్‌ సోను
  • ప్రాగ్‌ ఎల్వోసీ కమాండర్‌ రాణిత అలియాస్‌ జయమతి (రూపి)
  • నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ మెంబర్‌ రామ్‌ షీలా

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..