Traffic Violation: ఏకంగా 270 సార్లు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన మహిళ.. దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు

బెంగళూరుకు ట్రాఫిక్‌ పోలీసులు ఓ మహిళకు భారీ షాక్‌ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆమె పాల్పడింది. ఈ మేరకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్‌ వంటి పలు కారణాల రిత్యా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గానూ ఏకంగా రూ.1.36 లక్షలు జరిమానా విధించారు..

Traffic Violation: ఏకంగా 270 సార్లు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన మహిళ.. దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు
Traffic Violation
Follow us

|

Updated on: Apr 18, 2024 | 9:04 AM

బెంగళూరు, ఏప్రిల్ 18: బెంగళూరుకు ట్రాఫిక్‌ పోలీసులు ఓ మహిళకు భారీ షాక్‌ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆమె పాల్పడింది. ఈ మేరకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్‌ వంటి పలు కారణాల రిత్యా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గానూ ఏకంగా రూ.1.36 లక్షలు జరిమానా విధించారు. ఇది ఆమె డ్రైవ్‌ చేస్తోన్న హోండా యాక్టీవా ధర కంటే ఎక్కువ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో పటిష్ట నిఘాతో పర్యవేక్షిస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం ట్రాఫిక్‌ నిబంధనలు ఎడాపెడా అతిక్రమించింది. సీసీటీటీ ఫుటేజీ ఆధారంగా ఓ డాక్యుమెంట్‌ తయారు చేసి చూడగా మొత్తం 270 సార్లు ఆమె ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లు, జరిమానాలను కట్టవలసిందిగా ఆమెకు వరుసగా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న యాక్టివాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా బైక్‌ నడిపినందుకు ఆమెకు ట్రాఫిక్‌ పోలీసులు తగిన శాస్తి చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా బెంగళూరులో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి, జరిమానాలను డిజిటల్‌గా విధించడానికి పట్టణ కేంద్రాలు ఎక్కువగా సీసీటీవీ పుటీజీలను ఉపయోగిస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించి ప్రమాదాలకు గురికావడంతో తమ కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగల్చడంతోపాటు రోడ్డుపై ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నారు. గతంలోను ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, భారీగా జరిమానాలు విధించినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రావట్లేదని పోలీసు జాయింట్ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు. రోడ్డుపై గురయ్యే ప్రమాదాలతో పోల్చితే తామే విధించే జరిమానాలు చాలా తక్కవ అని అన్నారు. నిర్లక్షమైన డ్రైవింగ్‌ రోడ్డు మరణాల రేటును పెంచుతుందని, ట్రాఫిక్‌ చట్టాలకు కట్టుబడి ఉండవల్సిన అవసరం నొక్కి చెప్పేందుకే కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది చివర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ ద్విచక్ర వాహన దారుడికి పది వేల రూపాయలన స్పాట్‌ ఫైన్‌ విధించారు. మరో రూ.1.3 లక్షల బకాయిలు ఉన్నాయి. అతను 225 సార్లు ట్రాఫిక్‌ను ఉల్లంఘించాడు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ (TMC) అధిక సార్లు ఉల్లంఘనకు పాల్పడిన వాహనాల జాబితాను విడుదల చేసింది. వీటిని పోలీసు స్టేషన్‌లకు పంపించి జరిమానాలను వసూలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.