Telecom: భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
ఈ గ్రామాలు హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి జిల్లాలో ఉన్నాయి. ఈ గ్రామాలు సముద్ర మట్టానికి సుమారు 14,931 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దేశంలోని మొదటి గ్రామానికి టెలికం సేవలు అందాయి. కనెక్టింగ్ ది అన్ కనెక్ట్‌డ్ అని రాసుకొచ్చింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు...

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచదేశాలతో పోటీపడుతోన్న ఇండియన్ టెలికం ఇండస్ట్రీ ఇప్పుడు భారత దేశంలో తొలి గ్రామానికి ఇంటర్నెట్ సేవలను అందించింది. భారతదేశంలోనే తొలిగ్రామంగా పేరు గాంచిన హిమాచల్ ప్రదేశ్‌లోని కౌరిక్, గుయాకు టెలికాం కనెక్టివిటీని అందించారు.
ఈ గ్రామాలు హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి జిల్లాలో ఉన్నాయి. ఈ గ్రామాలు సముద్ర మట్టానికి సుమారు 14,931 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దేశంలోని మొదటి గ్రామానికి టెలికం సేవలు అందాయి. కనెక్టింగ్ ది అన్ కనెక్ట్‌డ్ అని రాసుకొచ్చింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టవర్‌కు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు.
Telecom connectivity reaches 14,931 Ft above sea level at India’s first village, Kaurik and Guea, in Lahaul & Spiti District, HP.
🛜 Connecting the unconnected. pic.twitter.com/tD3CwsAUj9
— DoT India (@DoT_India) April 16, 2024
ఈ ప్రాంతం స్పితి అనే నది లోయ పరివాహక ప్రాంతంలో ఉంది. కౌరిక్ టిబెట్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. గుయా గ్రామం స్పితి వ్యాలీలోని టాబో అనే గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 31.11 అంక్షాం, 77.16 రేఖాంశంలో ఉంది. ఈ గ్రామం ఇండియా-చైనా సరిహద్దుకు అత్యంత చేరువలో ఉంటుంది. ఈ విధంగా మారుమూల ప్రాంతానికి కూడా టెలికం సేవలు అందించి అరుదైన ఘనతను సాధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..