పెళ్లి బృందం వెళుతున్న వ్యానును ఢీకొట్టిన ట్రాలీ.. 9 మంది దుర్మరణం..!

పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వ్యాన్‌ను వేగంగా వచ్చిన ట్రాలీ ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే, ట్రాలీ ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జయి అక్కడికక్కడే అందరూ చనిపోయారు. సంతోషంగా బయల్దేరిన వారంతా ప్రమాదంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పెళ్లి బృందం వెళుతున్న వ్యానును ఢీకొట్టిన ట్రాలీ.. 9 మంది దుర్మరణం..!
Jhalawar Road Accident
Follow us

|

Updated on: Apr 21, 2024 | 9:38 AM

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రాలీ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వ్యాన్‌ను వేగంగా వచ్చిన ట్రాలీ ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే, ట్రాలీ ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జయి అక్కడికక్కడే అందరూ చనిపోయారు. సంతోషంగా బయల్దేరిన వారంతా ప్రమాదంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సమాచారం ప్రకారం, జిల్లాలోని అక్లెరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని దుంగ్రీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన అనంతరం దుగర్‌గావ్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఎన్‌హెచ్ 52లోని పచోలా సమీపంలో మారుతీ వ్యాన్‌ను ట్రాలీ ఢీకొట్టింది. పోలీస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో భోపాల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని అక్లెరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సందీప్ బిష్ణోయ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వ్యాన్‌లో చిక్కుకున్న క్షతగాత్రులను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షల అనంతరం 9 మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో, గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా 35 ఏళ్ల లోపు వారేనని పోలీసులు వెల్లడించారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అధికారి తెలిపారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతుండగా, ఇది రెండో భారీ ప్రమాదంగా చెప్పారు. అంతకుముందు గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు వ్యక్తులు డంపర్‌తో నలిగి చనిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Latest Articles