Loksabha election 2024 : ఇంత చిన్నపిల్లకు ఓటేంది అనుకునేరు..! ఆమె వయసు ఎంతో తెలుసా..?
ఇప్పటికే తాను రెండుసార్లు ఓటు వేసానని చెప్పింది. ఈ సారి కూడా తాను తన ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఇది మన కర్తవ్యం అని ఆమె పేర్కొన్నారు. ఆమె తన చిన్నవేలిపై వేసిన సిరా మార్కును మీడియా ముందు ప్రదర్శించింది.
Loksabha election 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏప్రిల్ 19న ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో తొలి దశలో ఓటింగ్ పూర్తైంది. ప్రజలు ఓటు వేసేందుకు వస్తున్న క్రమంలో కనిపించిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రపంచంలోనే అత్యంత చిన్నపిల్లలా కనిపించే మహిళ జ్యోతి అమ్గే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. ప్రస్తుతం జ్యోతి ప్రపంచంలోనే అత్యంత చిన్నపిల్లగా కనిపించే మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జ్యోతి ఎత్తు కేవలం 2 అడుగుల 63 సెం.మీ జ్యోతి మాత్రమే. ఈమె 1993 డిసెంబర్ 16న నాగ్‌పూర్‌లో జన్మించింది. జ్యోతి ఆంకోడ్రోప్లాసియాతో బాధపడుతోంది. ఇది ఎముకల వ్యాధి. దానివల్ల బాధిత వ్యక్తి శరీరం ఎదగలేదట.
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి కిషన్‌జీ అమ్గే శుక్రవారం ఉదయం లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. 2.8 సెం.మీ (2 అడుగులు, ¾ అంగుళాలు) పొడవు ఉన్న జ్యోతి, తన ఇంటికి సమీపంలో ఉన్న స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్లో నిలబడి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా జ్యోతిని స్థానిక మీడియా పలకరించింది. జ్యోతి మాట్లాడుతూ.. ఇది తన రెండవ లోక్‌సభ ఎన్నికల ఓటు అని చెప్పింది. తాను ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసానని చెప్పింది. ఈ సారి కూడా తాను తన ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఇది మన కర్తవ్యం అని ఆమె పేర్కొన్నారు. ఆమె తన చిన్నవేలిపై వేసిన సిరా మార్కును మీడియా ముందు ప్రదర్శించింది.
#WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024
డిసెంబర్ 16, 2011న ఆమె 18వ పుట్టినరోజున, జ్యోతిని అధికారికంగా భూమిపై అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఆమెను భారతదేశంలోని ఆరెంజ్ సిటీకి ప్రియతమంగా ప్రకటించింది. కానీ తనకు జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మాత్రమే ఆమె ఎత్తు. భారతీయ, హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోలలో జ్యోతికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..