Watch Video: ఛీఛీ.. ఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని చూస్తే..
మహిళ రెండవ గుడ్డును బ్యాగ్‌లో పెట్టడానికి వెళ్లినప్పుడు, దుకాణదారుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి బ్యాగ్‌లో ఏముందని అడిగాడు. బ్యాగ్‌లోపలికి చూశాడు. దుకాణదారుడికి అనుమానం వచ్చి అడిగితే.. తాను వేరే దుకాణంలో గుడ్లు కొన్నాని చెప్పింది ఆ మహిళ. ఆమె మాటలపై అనుమానంతో అతడు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశాడు. దీంతో వారివురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పబ్లిక్ ప్లేస్‌లు, దుకాణాల్లో విలువైన వస్తువులు దొంగిలించబడతాయనే భయం తరచుగా ప్రతి ఒక్కరి మనస్సులో ఉంటుంది. ఎందుకంటే – దొంగలు రద్దీగా ఉండే ప్రదేశాలను టార్గెట్‌గా చేసుకుని తమ చేతికి పని చెబుతుంటారు. జనసమూహాలు ఎక్కువగా ఉన్న చోట, రద్దీగా ఉండే దుకాణాలు, షాపింగ్ మాల్స్, బస్సులు, రైల్లలో ఎక్కువగా దోపిడీలకు పాల్పడుతుంటారు. ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నసరే.. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కేటుగాళ్లు అది మెడికల్ షాపై సరే.. లేదంటే.. కిరాణా దుకాణం అయినా సరే తమ పనికానిచ్చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. దీంతో ప్రతి దుకాణంలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో దొంగలకు చెక్ పెట్టడం ఈజీగా మారింది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు మహిళలు దుకాణానికి వెళ్లి గుడ్లు దొంగిలించడం కనిపించింది.
వైరల్ వీడియోలో ఒక చికెన్ సెంటర్ కనిపించింది. ఇద్దరు మహిళలు చికెన్ కొనేందుకు దుకాణానికి వెళుతుండటం కనిపించింది. దుకాణదారుడు చికెన్ కొడుతున్నాడు. కానీ, ఇంతలో ఆ మహిళ షాపులోని ట్రేలో పెట్టిన కోడి గుడ్లను దొంగతనం చేసింది. దుకాణదారుడు చికెన్ కోసే పనిలో బిజీగా ఉండగా, అదే అదునుగా ఆ మహిళ మరొక గుడ్డును తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టుకోవడానికి వెళ్తుండగా, దుకాణదారుడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. వైరల్ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.
మీరు వైరల్ వీడియోలో చూసినట్లుగా, మహిళ రెండవ గుడ్డును బ్యాగ్‌లో పెట్టడానికి వెళ్లినప్పుడు, దుకాణదారుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి బ్యాగ్‌లో ఏముందని అడిగాడు. బ్యాగ్‌లోపలికి చూశాడు. దుకాణదారుడికి అనుమానం వచ్చి అడిగితే.. తాను వేరే దుకాణంలో గుడ్లు కొన్నాని చెప్పింది ఆ మహిళ. ఆమె మాటలపై అనుమానంతో అతడు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశాడు. దీంతో వారివురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
@gharkekalesh pic.twitter.com/l8Scp9V3pA
— Arhant Shelby (@Arhantt_pvt) April 18, 2024
ఈ వీడియో X (Twitter) ఖాతా @gharkekalesh నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. షాపులో సీసీటీవీ కెమెరా ఉండడంతో జరిగిన ఘటన మొత్తం అందులో రికార్డైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ‘సీసీటీవీ లేకుంటే ఈ మహిళ దొంగతనం పట్టు ఉండేది కాదంటూ చాలా మంది కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..