Watch Video: నెటిజన్లను ఊరిస్తున్న బ్లూకలర్ ఘీ రైస్.. వీడియోపై నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 15 మిలియన్ల వీక్షణలను పొందింది. పోస్ట్ పై నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి స్పష్టంగా డిష్ ఇష్టం లేదని చెప్పగా, మరొక వ్యక్తి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, మరొకరు మాత్రం ఆ ప్రకాశవంతమైన నీలం రంగు అన్నం చూస్తుంటే నాకు ఆకలి వేస్తుందని అన్నారు.
వింత ఆహారాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆహారంపై రకరకాల ప్రయోగాలు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల వింత ఆహారాన్ని చూసి ఉంటారు. ప్రస్తుతం మనం రోజూ తినే అన్నంతో ఇలాంటి వింత ప్రయోగమే జరిగింది. ప్రస్తుతం బ్లూ రైస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. ఈ బ్లూ రైస్‌ని ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు..ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సాంప్రదాయ నెయ్యి రైస్ రెసిపీలో చమత్కారమైన ట్విస్ట్‌తో బ్లూ కలర్ నెయ్యి రైస్ రెసిపీని తయారు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలను పొందుతున్న కొత్త ఆహార ట్రెండ్. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘తేకుకింగ్‌మ్మ’ గత వారం ఈ వీడియోను షేర్ చేశారు. రెసిపీ పదార్థాలు వీడియో శీర్షికలో వెల్లడించారు.
* బ్లూ రైస్ తయారీ కోసం కావలసిన పదార్థాలు:
– శంకు పువ్వులు – 20 పువ్వులు
– నెయ్యి – 2 టీస్పూన్లు
– మసాలా దినుసులు
– ఉప్పు – 1 టేబుల్ స్పూన్
– బాస్మతి బియ్యం – 1 కప్పు
– నీరు – 3 కప్పులు
– జీడిపప్పు – 10
– ఎండుద్రాక్ష – 10
– తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
– బే ఆకులు – 2
ఈ ఫుడ్ వ్లాగర్ శంకుపూలను ఉపయోగించి ఈ బ్లూ రైస్‌ను తయారు చేశారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళను.. శంకుపూలను ఒక బౌల్‌లోకి తీసుకుని శుభ్రంగా కడిగింది. రేకులను వేరు చేస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు బాస్మతి బియ్యాన్ని వేసి 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి. మరోక పాత్రలో అన్నం వండటానికి కావాల్సినన్నీ నీటిని తీసుకుని మరిగించి అందులో ఈ శంకుపూల రేకులను వేయాలి. ఆ నీరు బాగా మరిగిన తరువాత ఒక చెంచాతో నీళ్లలోంచి పువ్వులను తొలగించేయాలి.. ఆ నీళ్లు నీలి రంగులోకి మారిపోయాయి. అప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఆ మరిగిన నీళ్లలో వేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత అందులో నెయ్యి కలుపుతారు. మరో పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బే ఆకులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కొన్ని సెకన్ల తర్వాత ఉడికించిన బ్లూ రైస్ వేసి బాగా కలిపేసుకోవాలి. మరో రెండు నిమిషాలు అన్నం బాగా దమ్ముకు పెట్టేసి దించేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బ్లూ కలర్ రైస్ రెడీ అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 15 మిలియన్ల వీక్షణలను పొందింది. పోస్ట్ పై నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి స్పష్టంగా డిష్ ఇష్టం లేదని చెప్పగా, మరొక వ్యక్తి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, మరొకరు మాత్రం ఆ ప్రకాశవంతమైన నీలం రంగు అన్నం చూస్తుంటే నాకు ఆకలి వేస్తుందని అన్నారు.
కానీ చాలా మంది ఈ ప్రత్యేకమైన వంటకాన్ని ఇష్టపడ్డారు. ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయండి.. అది ఊదా రంగులోకి మారుతుందని ఒక వ్యక్తి చెప్పాడు. “రిసిపి బాగుంది,” అని కొందరు, మరికొందరు “వావ్” అన్నారు. “మలేషియాలో మేము ఈ పువ్వును ఉపయోగించి బ్లూ రైస్ కూడా తింటాము. దాని పేరు ‘నాసి కెరాబు’,” అని మరొక వ్యక్తి అభిప్రాయపడ్డాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..