కొండచిలువ, అనకొండతో పోలిక.. భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో..

శాస్తవేత్తలు అతిపెద్ద పరిశోధన చేశారు. ఇప్పటిదాకా భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము అవశేషాలను కనుగొన్నారు. గుజరాత్‌లో 2005లో వెలికితీసిన ఓ పాము వెన్నెముక శిలాజం.. దానికి సంబంధించినదిగా గుర్తించారు. ఈ పాము టీ రెక్స్ కన్నా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందామా..

కొండచిలువ, అనకొండతో పోలిక.. భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో..
Snake Fossil
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2024 | 12:05 PM

శాస్తవేత్తలు అతిపెద్ద పరిశోధన చేశారు. ఇప్పటిదాకా భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము అవశేషాలను కనుగొన్నారు. గుజరాత్‌లో 2005లో వెలికితీసిన ఓ పాము వెన్నెముక శిలాజం.. దానికి సంబంధించినదిగా గుర్తించారు. ఈ పాము టీ రెక్స్ కన్నా పొడవైనదన చెబుతున్న ఐఐటీ రూర్కీకి చెందిన శాస్ర్తవేత్తలు.. దీనికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. దీన్ని జెయింట్ స్నేక్‌గా నిర్ధారించారు. ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు వెలికితీసిన 27 వెన్నెముక భాగాల్లో.. కొన్ని ఎముకలు భారీ కొండచిలువను పోలి ఉన్నాయని చెబుతున్నారు. అలాగే అవి విషపూరితమైనవి కాదని.. ఈ పాము పొడవు సుమారు 50 అడుగులు ఉండొచ్చునని శాస్తవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పాము బరువు ఏకంగా వెయ్యి కిలోలు ఉంటుందని లెక్కగట్టారు శాస్తవేత్తలు. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలను ‘స్ప్రింగర్ నేచర్’ అనే సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో తాజాగా పబ్లిష్ చేశారు.

‘వాసుకి ఆకారానికి బట్టి నెమ్మదిగా కదులుతూ తన ఎరను మాటు వేస్తుంది. అనకొండ, కొండచిలువ మాదిరిగానే తన ఎరను ఇది కూడా మెలితిప్పి ఊపిరిఆడకుండా చేస్తుంది. నాటి భౌగోళిక ఉష్ణోగ్రతల బట్టి ఇది గుజరాత్ తీర ప్రాంతంలోని చిత్తడి నేలల్లో జీవించేది’ అని పరిశోధన హెడ్ దెబాజిత్ దత్తా జాతీయ మీడియాకు చెప్పారు. నాగదేవతల రాజైన వాసుకి పేరును ఈ పాము శిలాజానికి పెట్టారు. సుమారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం టైటనోబోవా అనే భారీ స్నేక్ జీవించేది. అది సుమారు 43 అడుగుల పొడవు ఉండేది. అయితే ఈ వాసుకి వెన్నెముక శిలాజం టైటనోబోవా కంటే కూడా పెద్దగా ఉండటంతో.. దాని పొడవు టైటనోబోవా పొడవు కన్నా ఎక్కువే ఉండొచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ వాసుకి పాము ఆకారంలో పెద్దదా.. లేక సన్నదా అనేది ఇంకా క్లారిటీగా ఇప్పుడే చెప్పలేమన్నారు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ సునీల్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం భూమిపై జీవిస్తోన్న అతిపెద్ద పాము రెటికులేటెడ్ పైథాన్. దీని పొడవు 33 అడుగులు.