Watch Video: రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..? ఈ వీడియో చూస్తే ఇక జన్మలో ముట్టరు..

ఎండాకాలంలో ప్రయాణించేటప్పుడు ఎండ నుండి తమను తాము రక్షించుకోవడానికి రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌ బయట దుకాణాల వద్ద కూల్‌డ్రింక్‌లు, జ్యూస్‌లు, నిమ్మకాయ రసం వంటివి తాగుతుంటారు. అయితే, అలాంటి ప్రదేశాల్లో జ్యూస్‌ ల తయారీలో ఎంత వరకు పరిశుభ్రత పాటిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాకపోతే వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒక్కసారి చూసి జాగ్రత్తపడండి.

Watch Video: రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..? ఈ వీడియో చూస్తే ఇక జన్మలో ముట్టరు..
Unhygienic Lemon Juice Sell
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 20, 2024 | 10:08 AM

ఈ యేడు వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధిక వేడిమి, ఉక్కపోత, చెమట కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి ఆహారం తినడానికి, లేదంటే తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఎండాకాలంలో ప్రయాణించేటప్పుడు ఎండ నుండి తమను తాము రక్షించుకోవడానికి రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌ బయట దుకాణాల వద్ద కూల్‌డ్రింక్‌లు, జ్యూస్‌లు, నిమ్మకాయ రసం వంటివి తాగుతుంటారు. అయితే, అలాంటి ప్రదేశాల్లో జ్యూస్‌ ల తయారీలో ఎంత వరకు పరిశుభ్రత పాటిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాకపోతే వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒక్కసారి చూసి జాగ్రత్తపడండి. ఇందులో ముంబైలోని రైల్వే స్టేషన్ వెలుపల నిమ్మకాయ రసం తయారు చేసిన జ్యూస్ మేకర్ పని చూస్తే.. ఇకపై మీరు మీ జీవితంలో అలాంటి చోట నిమ్మకాయ నీళ్లు ముట్టనే ముట్టరు.

వైరల్ వీడియోలో, ఖార్ఘర్ రైల్వే స్టేషన్ బయట ఒక స్టాల్‌ కనిపిస్తుంది. అక్కడ ఒక వ్యక్తి నిమ్మకాయ నీళ్లు తయారుచేసి అమ్ముతున్నాడు. కానీ, ఆ సమయంలో అతడు చేస్తున్న పని చూస్తే జుగుప్సకరంగా ఉంది. జ్యూస్‌ తయారుచేస్తున్న వ్యక్తి అదే చేతులతో ఎక్కడ పడితే అక్కడ తన శరీరాన్ని గోక్కుంటూ కనిపిస్తున్నాడు. చేతులు కడుక్కోకుండా, పరిశుభ్రత పాటించకుండా మళ్లీ అదే చేత్తో వినియోగదారులకు జ్యూస్‌ను తయారు చేస్తున్నాడు. కానీ, ముంబైలోని చాలా జ్యూస్ సెంటర్లలో ఇటువంటి అపరిశుభ్రతే కనిపిస్తుంటుంది. వ్యాపారులు ఎలాంటి ప్రామాణాలు పాటించకుండానే ఆహార ఉత్పత్తులు తయారు చేస్తుంటారని ఈ వీడియో చూసిన పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

@Abhimanyus78 పేరుతో X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో, ఇలాంటి వారి వల్లే ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని అంటున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రంగా జ్యూస్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..