Prestige Group owner Irfan Razack: కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..! వీళ్ల ఆస్తుల వివరాలు తెలిస్తే..
అతడు నిర్వహిస్తున్న కంపెనీ నేడు స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. కానీ, ఇర్ఫాన్ రజాక్ మాత్రం చాలా నిరాడంబరమైన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. 1953లో జన్మించిన ఇర్ఫాన్ రజాక్ తన తండ్రి టైలర్ షాపులో పని చేస్తూ పెరిగాడు. అలాంటిది నేడు అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు.
ఇర్ఫాన్ రజాక్.. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. బెంగళూరు చెందిన ప్రెస్టీజ్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన రెండవ అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. ఇర్ఫాన్ రజాక్ బెంగళూరులోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరడానికి అతడు పడిన శ్రమ అనిర్వచనీయం. వ్యాపార జీవితంలో అతని ప్రయాణం అద్భుతమైనది. తన తండ్రి టైలర్ షాపులో పనిచేసిన ఇర్ఫాన్ నేడు కోటీశ్వరుడిగా ఎదిగాడు. బెంగుళూరు, ముంబై వంటి నగరాల్లో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేసింది ఈ సంస్థ. ఇర్ఫాన్ రజాక్ తండ్రి రజాక్ సత్తార్ ఒక చిన్న దుస్తులు, టైలర్ దుకాణాన్ని ప్రారంభించిన తర్వాత ప్రెస్టీజ్ గ్రూప్‌ను స్థాపించారు. కంపెనీ ప్రయాణం 1950లో బెంగళూరు నుంచి ప్రారంభమైంది. టేలర్ షాప్ నుండి బిలియన్ డాలర్ కంపెనీకి ఈ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రెస్టీజ్ గ్రూప్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ప్రముఖ పేరుగాంచిన కంపెనీ. ఈ కంపెనీ బెంగుళూరు, కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను నిర్వహించింది. ఈ సంస్థ ప్రతిష్టాత్మకమైన లేఅవుట్, నిజమైన మధ్యతరగతి ప్రజల కోసం అపార్ట్‌మెంట్‌లను నిర్మిస్తుంది. దీని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇర్ఫాన్ రజాక్. అతను ఇప్పుడు కోటీశ్వరుడు. అతడు నిర్వహిస్తున్న కంపెనీ నేడు స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. కానీ, ఇర్ఫాన్ రజాక్ మాత్రం చాలా నిరాడంబరమైన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. 1953లో జన్మించిన ఇర్ఫాన్ రజాక్ తన తండ్రి టైలర్ షాపులో పని చేస్తూ పెరిగాడు. అలాంటిది నేడు అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు.
బెంగళూరులో పేరెన్నికగన్న ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ చెన్నై, కొచ్చి, కాలికట్, హైదరాబాద్, ముంబై నగరాల్లో తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విస్తరించనుంది. ఇర్ఫాన్ రజాక్ తల్లిదండ్రులు రిజ్వాన్, నోవామన్ కూడా ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. రజాక్ నాయకత్వంలో, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌గా ఉద్భవించింది. కంపెనీ వ్యాపారం నివాస, వాణిజ్య, రిటైల్, హాస్పిటాలిటీ వంటి విభాగాలలో విస్తరించి ఉంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ 7.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మించింది. 285 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. 54 ప్రాజెక్టులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. ఇది ఆపిల్, క్యాటర్‌పిల్లర్, అర్మానీ, లూయిస్ విట్టన్ మొదలైన ప్రతిష్టాత్మక కంపెనీల కోసం భవనాలను నిర్మించింది.
నేడు ఇర్ఫాన్ రజాక్ నికర విలువ 1.3 బిలియన్ డాలర్లు. ఇంతగా ఎదుగుతున్నా రజాక్ కుటుంబం మాత్రం తమ మూలాలను వీడలేదు. ఇప్పటికీ బట్టలు, టైలరింగ్ దుకాణం నడుపుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..