Guinness World Record: 24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..!
ఒకటి కాదు రెండు కాదు 24గంటల్లో ఏకంగా వందకు పైగా బార్లను సందర్శించి ప్రపంచ రికార్డు సృష్టించిన 69 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ క్లార్క్సన్ (69) 24 గంటల్లో అత్యధిక బార్‌లను సందర్శించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను గెలుచుకున్నాడు . ఏప్రిల్ 12న ఉదయం నుంచి మొత్తం 24 గంటల్లో 120 పబ్బులను సందర్శించి రికార్డు సృష్టించాడు.
Guinness World Record: అరుదైన కార్యక్రమాలు, ఎవరూ సాధించలేని ఘనతలు సాధిస్తే గిన్నిస్ రికార్డ్ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఒక్కరోజులో ఎక్కువ పబ్‌లు సందర్శించి, మద్యం సేవించిన ఓ వ్యక్తికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది..! అదేంటి ఇలాంటి రికార్డ్ కూడా ఉంటుందా..? దీనికి కూడా గిన్నిస్ రికార్డ్‌లో స్థానం కల్పిస్తారా అని నోరెళ్ల బెట్టేశారా..? మీకు అస్సలు అలాంటి సందేహాలు వద్దు..ఎందుకంటే నిజంగానే ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు 24గంటల్లో ఏకంగా వందకు పైగా బార్లను సందర్శించి ప్రపంచ రికార్డు సృష్టించిన 69 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ క్లార్క్సన్ (69) 24 గంటల్లో అత్యధిక బార్‌లను సందర్శించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను గెలుచుకున్నాడు .
ఏప్రిల్ 12న ఉదయం నుంచి మొత్తం 24 గంటల్లో 120 పబ్బులను సందర్శించి రికార్డు సృష్టించాడు. గతంలో ఒక్కరోజులో 99 పబ్‌లను సందర్శించి రికార్డు సృష్టించిన డేవిడ్.. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఈ రికార్డు సిడ్నీలోని కెప్టెన్ కుక్ హోటల్‌లో ప్రారంభమై ససెక్స్ గార్డెన్ బార్‌లో ముగిసింది. ఒక్కరోజులోనే 120 బార్లలో మద్యం తాగి రికార్డు సృష్టించాడు. ఒక పబ్ నుంచి మరో పబ్‌కు నడుస్తూ రికార్డు నెలకొల్పాడు. చివరి ససెక్స్ గార్డెన్ బార్ డేవిడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను పొందింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..