Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Coffee : బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చాలా మందికి తెలియదు. బ్లాక్ కాఫీని అతిగా తాగేవారిలో జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల కెఫిన్ అధిక మొత్తంలో శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బ్లాక్ కాఫీని అతిగా తీసుకోవటం వల్ల కలిగే అనర్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Apr 19, 2024 | 4:02 PM

 అధిక కాఫీ వినియోగం మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమితో అవస్థపడాల్సి వస్తుంది. పడుకునే కొన్ని గంటల ముందు కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

1 / 5
ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తుంది. బ్లాక్ కాఫీ అతిగా తాగడం వల్ల మీ శరీరం నుంచి ఒత్తిడి హార్మోన్లు అధిక స్థాయిలో విడుదలవుతాయి. ఇది ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల చికాకు పెరుగుతుంది.

2 / 5
బ్లాక్‌ కాఫీ ఎక్కువగా తాగే వారిలో పొట్టకు హాని కలిగిస్తుంది. బ్లాక్ కాఫీలో కెఫిన్, యాసిడ్ చాలా ఉన్నాయి. కాబట్టి అధిక వినియోగం మీ పొట్టలో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. మీరు మలబద్ధకం, కడుపు నొప్పిని అనుభవించవచ్చు.

3 / 5
మీ జీవనశైలిలో కాఫీని అధికంగా తీసుకుంటే, మీ రోజువారీ ఆహారం నుండి ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం శరీరానికి కష్టతరం చేస్తుంది.

4 / 5
అయితే, రోజులో కెఫిన్‌ను 400 మిల్లీగ్రాములకు మించకుండా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది దాదాపు 4 కప్పుల (960 ml) కాఫీకి సమానం.

5 / 5
Follow us