రుణం తీసుకున్న వ్యక్తికి రుణం చెల్లించడానికి బ్యాంకు చాలా సమయం ఇస్తుంది. కానీ రుణగ్రహీత ఇప్పటికీ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకు అతనికి రిమైండర్లు, నోటీసులు పంపుతుంది. దీని తర్వాత కూడా రుణగ్రహీత రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, బ్యాంకు అతని ఆస్తిని స్వాధీనం చేసుకుని, ఆపై వేలం వేస్తుంది. అంటే, బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. కానీ చెల్లించని పక్షంలో ఆస్తిని వేలం వేయడం ద్వారా రుణ మొత్తం తిరిగి పొందే విధంగా చేస్తారు.