మహానదిలో పెను ప్రమాదం… 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా.. పలువురు గల్లంతు..

పడవ బోల్తా పడడంతో స్థానికంగా ఉన్న కొందరు మత్స్యకారులు ధైర్యం చేసి 40 మందికి పైగా రక్షించారు. గల్లంతైన వారి మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఇక జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్నరాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా.. పలువురు గల్లంతు..
Boat Capsizes
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 20, 2024 | 11:42 AM

ఒడిశాలోని జార్సుగూడలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు జలసమాధి అయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ కూడా ఉన్నారని తెలిసింది. ఈ ఘటన అనంతరం అక్కడే ఉన్న స్థానిక మత్స్యకారులు 40 మందికి పైగా ప్రాణాలను కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.

ఒడిశాలోని జార్సుగూడలో పెను ప్రమాదం జరిగింది. మహిళలు, పిల్లలు సహా దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మహానందిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారని తెలిసింది. గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.4 లక్షల సాయం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన జార్సుగూడలోని లఖన్‌పూర్ బ్లాక్ పరిధిలోని శారద సమీపంలోని మహానదిలో జరిగింది. పిల్లలు, మహిళలు ప్రయాణిస్తున్న పడవ కొన్ని కారణాల వల్ల బోల్తా పడింది. బోటు బోల్తా పడడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా నీళ్లలో కుప్పకూలింది. అరుపులు, కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక మత్స్యకారులకు కూడా తెలిసింది. స్థానిక మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ను ఘటనా స్థలానికి పంపినట్లు డీజీ ఫైర్ సుధాన్షు సారంగి తెలిపారు. స్కూబా డైవర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నీటి అడుగున కెమెరాలతో ఇద్దరు స్పెషలిస్ట్ స్కూబా డైవర్లను పంపారు. రక్షించేందుకు భువనేశ్వర్‌ నుంచి ఝార్సుగూడకు బృందాన్ని తరలించారు.

పడవలో బార్‌ఘర్ జిల్లాలోని బంధిపాలి ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పడవ బోల్తా పడడంతో స్థానికంగా ఉన్న కొందరు మత్స్యకారులు ధైర్యం చేసి 40 మందికి పైగా రక్షించారు. గల్లంతైన వారి మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఇక జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. పలువరు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. బాధితులకు సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..