198 మంది ఉద్యోగులకు 83 కోట్ల భారీ బోనస్ ప్రకటించిన కంపెనీ.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్న ఎంప్లాయిస్..
మా కంపెనీ విజయాన్ని జరుపుకోవడానికి.. మేము మా ఉద్యోగులకు ఇంత భారీ మొత్తంలో రివార్డ్ ను ఇవ్వాలనుకుంటున్నామని.. తాము ఇలా ఇచ్చిన బోనస్ తో ఉద్యోగస్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ పేర్కొంది. మా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి కృషి, అంకితభావానికి తాను కృతజ్ఞుత తెలుపుతున్నానని కంపెనీ ప్రెసిడెంట్, వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ సెయింట్ జాన్ చెప్పారు.
ఉద్యోగస్తులు ఏడాది పడిన శ్రమ అంతా మరచిపోతూ ఆనందంగా ఎదురు చూసే రోజు బోనస్ ఇచ్చే రోజు. తమకు ఎంత బోనస్ వస్తుందో అని ఉద్యోగులంతా ఆలోచించడం సహజం. ఇప్పుడు ఓ అమెరికన్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సెయింట్ జాన్స్ ప్రాపర్టీస్ అనే అమెరికన్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ బోనస్ ను ప్రకటించింది. తమ కంపెనీలో పని చేస్తున్న 198 మంది ఉద్యోగులకు ఈ కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.83 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. అంటే ఒక్కో ఉద్యోగికి సగటున 50 వేల డాలర్లు .. మన దేశ కరెన్సీలో 41 లక్షల రూపాయలు బోనస్ గా ఇచ్చినట్లు అన్నమాట. తాము ఊహించని విధంగా ఇంత భారీ మొత్తంలో బోనస్ రావడంతో ఉద్యోగులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు
కంపెనీకి లాభాలు ఆర్జించడంలో సహాయపడిన ఉద్యోగులకు బోనస్ , అవార్డుని ఇస్తారు. ”మా కంపెనీ విజయాన్ని జరుపుకోవడానికి.. మేము మా ఉద్యోగులకు ఇంత భారీ మొత్తంలో రివార్డ్ ను ఇవ్వాలనుకుంటున్నామని.. తాము ఇలా ఇచ్చిన బోనస్ తో ఉద్యోగస్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ పేర్కొంది. మా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి కృషి, అంకితభావానికి తాను కృతజ్ఞుత తెలుపుతున్నానని కంపెనీ ప్రెసిడెంట్, వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ సెయింట్ జాన్ చెప్పారు.
నివేదికల ప్రకారం సెయింట్ జాన్స్ ప్రాపర్టీస్ కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్‌గా 10 మిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 83 కోట్లను కంపెనీలో పనిచేస్తున్న 198 మంది ఉద్యోగులకు అందించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..