Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవ అవసరాలతో ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

ఓ వైపు భూమి కుంగిపోతుంది.. మరోవైపు మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా కూడా మునిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక నగరం తర్వాత మరొకటి కుంగిపోనున్నాయి. లక్షలాది మంది ప్రజలు  నిరాశ్రయులుకానున్నారు. ప్రస్తుతం భారతదేశ పొరుగు దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది.  భూమిని భవన నిర్మాణాల కోసం, గనుల తవ్వకాలు అంటూ తవ్వేస్తున్నారు. అంతేకాదు నగరాల్లో లోతుగా తవ్వి మరీ నీటి వెలికితీత, ఎత్తైన భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం వల్ల మట్టిని తవ్వడంతో భూమిబలం తగ్గుతోంది

మానవ అవసరాలతో ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
China Major Cities Skinking
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2024 | 5:54 PM

మనుషుల అలవాట్లు, పర్యావరణానికి చేస్తున్న హానితో ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ముప్పు వాటిల్లనున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలు కాలంతో సంబంధం లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు భూమి కుంగిపోతుంది.. మరోవైపు మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా కూడా మునిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక నగరం తర్వాత మరొకటి కుంగిపోనున్నాయి. లక్షలాది మంది ప్రజలు  నిరాశ్రయులుకానున్నారు. ప్రస్తుతం భారతదేశ పొరుగు దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది.  భూమిని భవన నిర్మాణాల కోసం, గనుల తవ్వకాలు అంటూ తవ్వేస్తున్నారు. అంతేకాదు నగరాల్లో లోతుగా తవ్వి మరీ నీటి వెలికితీత , పట్టణ భవనాలు , మౌలిక సదుపాయాలతో పెరుగుతున్న బరువు కారణంగా, ఎత్తైన భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం వల్ల మట్టిని తవ్వడంతో భూమిబలం తగ్గుతోంది. దీంతో చైనాలోని చాలా నగరాలు ప్రమాదబారిన పడుతున్నాయి.

బీజింగ్, టియాంజిన్ వంటి పెద్ద , జనసాంద్రత కలిగిన నగరాలు ప్రమాదం అంచున ఉన్నాయని.. ఇప్పటికే కుంగిపోతున్నాయని సైన్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన పరిశోధనా జర్నల్ లో పేర్కొంది. చైనాలోని 45 శాతం శివారు ప్రాంతాలు వేగంగా కుంగిపోయి..  మునిగిపోతున్నాయి. ఇక్కడ భూమి క్షీణత సంవత్సరానికి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున 16 శాతం భూమి కుంగిపోతుంది.

2015  నుంచి 2022 మధ్య, 20 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా నగరాలు వేగంగా  నేలకూలుతున్నాయని అధ్యయనం కనుగొంది. గత దశాబ్ద కాలంలో షాంఘై దాదాపు 3 మీటర్ల మేర కుంగిపోయింది. బీజింగ్ సబ్‌వేలు, హైవేలు సంవత్సరానికి 45 మిల్లీమీటర్ల వద్ద స్థిరపడతాయి. ఎత్తైన భవనాలు నిర్మిస్తుండడంతో భూమి కిందకు కుంగిపోతుంది.

ఇవి కూడా చదవండి

పొరుగు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో మన దేశం నగరాల పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం భారతదేశంలో నీటి సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ఇప్పటికే పొడిగా మారింది. భూమి కింద నీరు అడుగంటిపోయింది. భారత్‌లో కూడా చైనా పరిస్థితిలా కొనసాగితే.. కోల్‌కతా, ముంబై వంటి పెద్ద మెట్రో నగరాలు కుంగిపోవచ్చని హెచ్చరిస్తున్నారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..