Summer Skin Care Tips: ఎండ నుంచి చర్మానికి ఉపశమనం కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్ బెస్ట్ ఆప్షన్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దీంతో ఎండలోకి వెళ్లిన తర్వాత చర్మం కాలిన ఫీలింగ్ ఏర్పడుతుంది. చెమటతో చర్మం కందిపోతుంది. చర్మం ప్రకాశాన్ని పునరుద్ధరించడానికి, తాజాదనాన్ని తీసుకురావడానికి వంటింటి చిట్కాలు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. వేసవి నుంచి చర్మానికి ఉపశమనం కోసం ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్ ను ప్రయత్నించండి.

Summer Skin Care Tips1
- చర్మం అలసట నుంచి ఉపశమనం పొందడానికి.. 1 చెంచా పుల్లని పెరుగులో 4 చెంచాల అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి చర్మాన్ని శుభ్రం చేసుకోండి. పుల్లని పెరుగు, కలబంద కూలింగ్ ఏజెంట్ గా మారి చర్మాన్ని రిఫ్రెష్ చేస్తాయి.
- చర్మంపై టాన్ పెరిగిపోతే రిఫ్రెష్ అవ్వడానికి పుల్లని పెరుగు, తేనె, కాఫీ, కోకో పౌడర్ ఉపయోగించండి. ఈ పదార్ధాలను కలిసి మందపాటిగా ప్యాక్ తయారు చేసుకోండి. దీనిని చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ కు తక్షణ మెరుపును అందిస్తుంది.
- టొమాటో చర్మంపై మచ్చలు, టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. తేనె మొటిమల సమస్యలను తొలగిస్తుంది, చర్మం తేమను నిర్వహిస్తుంది. టమోటాలతో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 10 నిమిషాల పాటు అప్లై చేయండి. ఇది చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది.
- చందనం కూలింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు ప్రకాశవంతంగా మార్చుతుంది. 2 చెంచాల గంధపు పొడిని 1 చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మంలోని జిడ్డును తగ్గించి తాజాదనాన్ని పెంచుతుంది.
- కీరదోసకాయ ఉత్తమ వేసవి పండు. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుల్లని పెరుగు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ తెస్తుంది. కీర దోసకాయను గ్రైండ్ చేసి అందులో పుల్లటి పెరుగు కలపాలి. దీన్ని చర్మంపై 30 నిమిషాలు అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల వడదెబ్బ, చికాకు, దద్దుర్లు దూరమవుతాయి.
- ఫేస్ వాష్ గా శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మం, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను దూరం చేస్తుంది. వేసవి చర్మ సమస్యలను సులభంగా దూరం చేస్తుంది.
- పుదీనా ఆకులను, రోజ్ వాటర్ , చిటికెడు పసుపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు పుదీనా ఆకులు చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రోజ్ వాటర్ చర్మం pH స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది.




